NTV Telugu Site icon

Rohit Sharma: డ్రెస్సింగ్ రూమ్‌లో క‌న్నీళ్లు పెట్టుకున్న హిట్ మ్యాన్.. అందుకేనా..

Rohith Sharma

Rohith Sharma

టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చుని ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తో ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగిన విష్యం తెలిసిందే. ఈ గేమ్ సందర్భంగానే ఈ ఘటన జరిగింది. ఈ మ్యాచ్‌ లో సన్‌రైజర్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ 48, కెప్టెన్ కమిన్స్ 35 నాటౌట్ తో రాణించారు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా, పీయూష్ చావ్లా చెరో మూడు వికెట్లు తీశారు. కాగా, ముంబై ఇండియన్స్ 17.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

Also Read: 100 Crores: నిర్మాతగా మారిన మ్యూజిక్ డైరెక్టర్.. ఏకంగా ‘100 క్రోర్స్’

సూర్యకుమార్ యాదవ్ 102 నాటౌట్ అజేయ శతకాన్ని అందించాడు. సూర్యతో కలిసి తిలక్ వర్మ 37 నాటౌట్ నిర్ణయాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. కాగా, ఈ మ్యాచ్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ (4; 5 బంతుల్లో 1 ఫోర్) పెవిలియన్ చేరుకున్నాడు. క్లాసెన్ బౌలింగ్‌లో కమిన్స్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రోహిత్ (4), ఇషాన్ కిషన్ (9), నమన్ ధీర్ (0) ధాటికి ముంబై ఇండియన్స్ 31 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ జట్టుకు మద్దతుగా నిలిచారు.

Also Read: Heavy Rain: పశ్చిమ బెంగాల్ లో భారీ వర్షం.. 12 మంది మృతి

పవర్‌ ప్లేలో చివరి రెండు బంతులు మిగిలి ఉండగానే, కెమెరామెన్ రోహిత్‌ ని డ్రెస్సింగ్ రూమ్‌ లో జూమ్ చేసినప్పుడు, అతను చేతితో తన కన్నీళ్లను తుడుచుకోవడం కనిపించింది. ఈ వీడియో వైరల్ కావడంతో రోహిత్ కన్నీళ్లపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ముంబై వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోగా, ఈ గేమ్‌లో కూడా ఓడిపోతామని భావించి హిట్‌మ్యాన్ ఏడ్చేశాడని, మరికొందరు రోహిత్ టీ20 ప్రపంచకప్‌కు ముందు ఫామ్ కోల్పోయి బాధపడ్డాడని అంటున్నారు. అయితే రోహిత్ ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నాడో స్వయంగా చెబితే కానీ ఎవరికీ తెలియదు.

Show comments