100 Crores: నిర్మాతగా మారిన మ్యూజిక్ డైరెక్టర్.. ఏకంగా ‘100 క్రోర్స్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య డెరైక్టర్లు చాలా మంది నిర్మాతలు అవుతున్నారు. అయితే ఈసారి భిన్నంగా మ్యూజిక్ డైరెక్టర్ ఒకరు నిర్మాత అవుతున్నారు. యధార్థ సంఘటనల ఆధారంగా తీసే చిత్రాల్లో ఓ సహజత్వం ఉంటుంది. అలా 2016లో జరిగిన ఓ రియల్ ఇన్సిడెంట్‌లను బేస్ చేసుకుని, వినోదభరితంగా ‘100 క్రోర్స్’ అనే సినిమాను నిర్మించారు. సాయి కార్తీక్, దివిజా కార్తీక్, ఎస్.ఎస్.స్టూడియోస్ బ్యానర్ మీద నిర్మించారు. విరాట్ చక్రవర్తి కథ అందించి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాహుల్, చేతన్, యమీ, సాక్షి చౌదరి, లహరి, అన్నపూర్ణమ్మ, ఐశ్వర్య, భద్రం, ఇంటూరి వాసు, సమీర్ వంటి వారు కీలక పాత్రలను పోషించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
సోమవారం నాడు ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్‌లో దర్శకులు వీర శంకర్, మల్లిక్ రామ్, నిర్మాత హర్షిత్ రెడ్డి, నిర్మాత దామోదర ప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అనంతరం చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఇక 100 క్రోర్స్ అనే టైటిల్‌తోనే సినిమాపై అందరిలోనూ ఆసక్తిని పెంచేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా చాలా కొత్తగా ఉంది. ఇక ఈ సినిమాకి చరణ్ మాధవనేని కెమెరామెన్‌గా వ్యవహరించారు. సాయి కార్తీక్ సంగీతాన్ని అందించగా ఎస్.బీ.ఉద్దవ్ ఎడిటర్‌గా, వింగ్ చున్ అంజి ఫైట్ మాస్టర్‌గా పని చేశారు. ఇక ఫైనాన్షియల్ ఇష్యూ చుట్టూ తిరిగే కథగా ఈ సినిమా ఉంటుందని అర్థం అవుతోంది. మరి రిలీజ్ అయితే కానీ ఈ 100 కోట్ల కథా కమామీషు ఏమిటి అనేది తెలియదు అనే చెప్పాలి.
Also Read
తాజావార్తలు
-
Uttar Pradesh: నా భార్య, ఆమె ప్రియుడు నన్ను చంపేస్తారు.. ప్రేమ పెళ్లి, ఇప్పుడు ప్రాణభయం..
-
Meher Ramesh: మొన్ననే కూతురి పెళ్లి.. ఇప్పుడు తీవ్ర విషాదంలో డైరెక్టర్ మెహర్ రమేష్ ఫ్యామిలీ!
-
Zimbabwe Captain: ‘వైభవ్ సూర్యవంశీ బ్యాటింగా..? అయితే ఏంటి..? ఇదిగో ఇలా పంపిస్తాం’
-
AIG Hospitalలో బాలయ్య.. ఈ రాత్రే సర్జరీ జరిగే అవకాశం?
-
Rajnath Singh: విద్యార్థులను రాజకీయాలకు వాడుకుంటారా? విపక్షాలపై రాజ్‌నాథ్‌సింగ్ ఫైర్
ట్రెండింగ్
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్‌ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్‌టాప్‌లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!