NTV Telugu Site icon

Rohit-Ritika Hug: రోహిత్‌ శర్మ హగ్ ఇచ్చినా.. బుంగమూతి పెట్టిన రితిక! వీడియో వైరల్

Rohit Ritika Hug

Rohit Ritika Hug

Rohit Sharma’s heartwarming moment with wife Ritika Sajdeh ahead of IND vs AUS 3rd ODI: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం (సెప్టెంబర్ 27) రాజ్‌కోట్‌ వేదికగా చివరిదైన మూడో వన్డే భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ కోసం తొలి రెండు వన్డేలకు విశ్రాంతి తీసుకున్న టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తిరిగి జట్టుతో చేరాడు. ఆసియా కప్ 2023 ఫైనల్ అనంతరం భారత్ వచ్చేసిన రోహిత్.. కుటుంబంతో కలిసి సరదాగా గడిపి ముంబైలో రాజ్‌కోట్‌ విమానం ఎక్కేశాడు. ముంబై విమానాశ్రమంలో రోహిత్‌ను దిగబెట్టేందుకు కారులో వచ్చిన అతని భార్య రితిక సజ్దే బుంగమూతి పెట్టుకున్నారు.

మూడో వన్డే కోసం రాజ్‌కోట్ వెళ్లేందుకు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ తన భార్య రితిక సజ్దేతో కలిసి కారులో ఈరోజు ఉదయం ముంబై విమానాశ్రమంకు వచ్చాడు. కారు దిగిన రోహిత్.. లోపల ఉన్న తన సతీమణికి వంగి మరీ హగ్ ఇచ్చాడు. రోహిత్‌ను వదిలి ఉండటం ఇష్టం లేని రితిక.. మొఖం అదోలా పెట్టారు. అది చూసిన రోహిత్ నవ్వుతూ చెయ్యి ఊపి లోపలికి వెళ్లిపోయాడు. దాంతో బరువెక్కిన హృదయంతో రితిక అక్కడినుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Also Read: AP Assembly Session 2023: 70 మంది అనుచరులను తీసుకొచ్చిన ఎమ్మెల్యే.. అసెంబ్లీ విజిటర్స్ గ్యాలరీలో హల్‌చల్!

ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ లైకుల, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘రోహిత్ చాలా రొమాంటిక్‌’, ‘రోహిత్- రితికలది అన్యోన్య దాంపత్యం’, రోహిత్‌లోని రొమాంటిక్ హీరో బయటకు వచ్చేశాడు’, బెస్ట్ కపుల్స్’, ‘రితికది గ్రేట్ లవ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రోహిత్ పూర్తి ‘ ఫ్యామిలీ మ్యాన్’ అని తెలిసిందే. సమయం దొరికినప్పుడల్లా భార్య, కూతురుతో కలిసి సరదాగా గడుపుతుంటాడు. కుటుంబంతో కలిసి బయటికి వెళ్లిన ఫొటోస్ రితిక ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటారు.