Site icon NTV Telugu

Rohit Sharma: రోహిత్ శర్మ అంటే ఆ మాత్రం ఉంటది.. వీడియో వైరల్..!

Rohit Sharma

Rohit Sharma

Rohit Sharma: ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం ముంబై జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన ఫన్నీ మూమెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మ్యాచ్ ముగిశాక రోహిత్ శ్రేయాస్ అయ్యర్ నడకను అనుకరిస్తూ ఓ వీడియోలో కనిపించాడు. ఈ వీడియోను ముంబై ఇండియన్స్ తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయగా, నెటిజన్లు దానిని విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు. ఈ వీడియోను చూసిన రోహిత్ అభిమానులు.. హిట్ మ్యాన్ అంటే ఆ మాత్రం ఉంటది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో.. నువ్వు అస్సలు తగ్గదు అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

Read Also: Virat Kohli-Anushka: విరాట్ కోహ్లీ, అనుష్క కిస్‌లు.. వీడియో వైరల్!

ఇక ఆ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అద్భుత ప్రదర్శనతో ముంబై ఇండియన్స్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించి, ప్లేఆఫ్స్‌లో టాప్ 2 స్థానాన్ని ఖాయం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 184/7 స్కోరు చేసింది. పవర్ ప్లేలో పంజాబ్ బాగా ఆడకపోయినా, ఆ తర్వాత జోష్ ఇంగ్లిస్, ప్రియాంశ్ ఆర్య కలిసి 59 బంతుల్లో 109 పరుగుల భాగస్వామ్యంతో మ్యాచ్‌ను విజయం వైపు నడిపించారు. ఆఖరులో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 16 బంతుల్లో 26 అజేయంగా నిలిచి ట్రెంట్ బోల్ట్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి విజయాన్ని అందించాడు. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ 2014 తర్వాత మొదటిసారిగా ప్లేఆఫ్స్‌ లోకి ప్రవేశించి, మే 29న ముల్లానుపుర్‌ వేదికగా జరిగే క్వాలిఫయర్ 1కి అర్హత సాధించింది.

Read Also: U16 Davis Cup: ఓడినా సిగ్గు లేదుగా.. ఓవర్ యాక్షన్ చేసిన పాకిస్తాన్ ప్లేయర్..!

ఇక ఈ విజయానంతరం మైదానంలో అందరి మధ్య రోహిత్ శర్మ చేసిన శ్రేయాస్ అయ్యర్ నడక అనుకరణ హైలైట్‌గా నిలిచింది. ఆ తర్వాత ఇద్దరూ నవ్వుతూ మాట్లాడటం కూడా వీడియోలో కనిపించింది. ఇంకెందుకు ఆలశ్యం ఈ వైరల్ ను మీరు కూడా చూసేయండి.

Exit mobile version