T20 World Cup 2024: ఎంఎస్ ధోనీని ఒప్పించడం కష్టమే: రోహిత్ శర్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dinesh Karthik impressed me Says Rohit Sharma: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, వెటరన్ కీపర్ దినేష్ కార్తీక్‌లపై భారత సారథి రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్ 2024లో ఇద్దరు సూపర్ ఫామ్‌లో ఉన్నారని, అద్భుతంగా ఆడుతున్నారని కితాబిచ్చాడు. ధోనీని టీ20 ప్రపంచకప్ 2024 కోసం వెస్టిండీస్‌కు వచ్చేలా ఒప్పించడం కష్టమే అని రోహిత్ పేర్కొన్నాడు. వికెట్ కీపర్ స్థానం కోసం డీకేను ఒప్పించడం మాత్రం సులువే అని హిట్‌మ్యాన్ చెప్పుకొచ్చాడు. నేడు ఐపీఎల్లో పంజాబ్‌తో ముంబై తలపడనుంది. ఈ నేపథ్యంలో మాజీలు మైఖేల్ వాన్, ఆడమ్ గిల్‌క్రిస్ట్‌లతో కలిసి క్లబ్ ప్రైరీ ఫైర్ పాడ్‌కాస్ట్‌లో రోహిత్ పాల్గొన్నాడు.
‘నేను ఎంఎస్ ధోనీ, దినేష్ కార్తీక్‌ల ఆటకు ఫిదా అయ్యా. ముఖ్యంగా డీకే ఆట నన్ను ఆకట్టుకుంది. గత రెండు మ్యాచ్‌లలో అతడు బ్యాటింగ్ చేసిన విధానం అద్భుతం. కొన్ని మంచి షాట్స్ ఆడాడు. డీకే పరుగుల దాహంతో ఉన్నాడు. ధోనీ కొట్టిన మూడు సిక్సులు సూపర్ అనే చెప్పాలి. 4 బంతుల్లో 20 పరుగులు చేశాడు. మహీ బ్యాటింగ్ మా జట్టుపై భారీ ప్రభావం చూపింది. మేం ధోనీ కొట్టిన 20 పరుగుల తేడాతోనే ఓడిపోయాం’ అని రోహిత్ శర్మ పోడ్కాస్ట్లో చెప్పాడు.
Also Read
Also Read: Rohit Sharma: నేను ఎవరినీ కలవలేదు.. అవన్నీ అవాస్తవాలే: రోహిత్ శర్మ
‘ఎంఎస్ ధోనీని టీ20 ప్రపంచకప్ 2024 కోసం వెస్టిండీస్‌కు వచ్చేలా ఒప్పించడం చాలా కష్టమే. ఐపీఎల్ 2024లో ఆడటం వల్ల మహీ భాయ్ అలసిపోతాడు. అంతేకాదు మోకాలి నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. అతడు వెస్టిండీస్‌కు రాకపోవచ్చు. కానీ అమెరికాకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గోల్ఫ్ ఆడేందుకు యూస్ వస్తాడని నేను అనుకుంటున్నా. ఇక వికెట్ కీపర్ స్థానం కోసం దినేష్ కార్తీక్‌ను ఒప్పించడం మాత్రం చాలా సులభం అని నేను ఊహిస్తున్నా’ అని హిట్‌మ్యాన్ అన్నాడు. రోహిత్ మాటలను బట్టి చూస్తే.. డీకేకు టీ20 ప్రపంచకప్‌లో చోటు ఖాయంగానే కనబడుతోంది. మరోవైపు టీ20 ప్రపంచకప్ 2021 సమయంలో భారత జట్టు మెంటార్‌గా ధోనీ సేవలందించిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
High Court Chief Justices: 8 హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్‌ల నియామకం.. పూర్తి జాబితా ఇదే
-
Mugguru Kothulu Song: ‘తిడుతున్నా కొడుతున్నా’ అంటూ మెస్మరైజ్ చేస్తున్న లవ్ సాంగ్.. అనూప్ చేతుల మీదుగా రిలీజ్
-
Plane Crash: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. చిన్న విమానం క్రాష్, ఇద్దరు మృతి
-
Tata Osprey SUV: టాటా Osprey SUV లాంచ్.. 120 PS పవర్, DCT గేర్‌బాక్స్, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
Ramnagar Stampede: రాంనగర్ గణేష్ ఆగమన్ ర్యాలీలో విషాదం.. తొక్కిసలాటలో యువకుడు మృతి
ట్రెండింగ్
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!