Rohit Sharma: విజయం తర్వాత రోహిత్ శర్మ ఎమోషనల్.. (వీడియో)

  • సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను 68 పరుగుల తేడాతో ఓడించిన భారత్
  • ఆనందంలో రోహిత్ శర్మ ఎమోషనల్
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
Rohit

Rohit

భారత స్పిన్నర్ల మాయాజాలంతో టీ20 ప్రపంచ కప్ 2024 రెండవ సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను 68 పరుగుల తేడాతో ఓడించి భారత్ ఫైనల్‌కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. లక్ష్యాన్ని చేధించడానికి రంగంలోకి దిగిన ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ చేతులెత్తేయడంతో 16.3 ఓవర్లలో 103 పరుగులకు ఆలౌటైంది. ఈ క్రమంలో.. టీమిండియా ఫైనల్స్కు చేరింది. ఈ ఆనందంలో రోహిత్ శర్మ ఎమోషనల్ అయ్యాడు.

Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

×
×
Ad

రోహిత్ భావోద్వేగానికి లోనైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డగౌట్ లో కూర్చున్న అతడిని కోహ్లీతో పాటు ఇతర సహచర ఆటగాళ్లు భుజంపై తట్టి ఉత్సాహపరిచేందుకు ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి. చివరిసారిగా 2022లో జరిగిన టీ20 ప్రపంచకప్ టోర్నీ సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించిన సంగతి తెలిసిందే.

Read Also: Vande Bharat Express: వందేభారత్, గతిమాన్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేగం 130 కి.మీకి తగ్గింపు..

ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ 39 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 57 పరుగులు చేశాడు. ఈ ప్రపంచకప్‌లో రోహిత్ శర్మకు ఇది మూడో అర్ధ సెంచరీ. ఈ టోర్నీలో టీం ఇండియా ఐదోసారి సెమీఫైనల్ మ్యాచ్‌ను ఆడి విజయం సాధించింది. ఫైనల్లో దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడనుంది.