Site icon NTV Telugu

Rohit Sharma Daughter: మా డాడీ ఇంకో నెలలో న‌వ్వుతాడు.. స‌మైరా వీడియో వైరల్!

Samaira

Samaira

Rohit Sharma Daughter Samaira Says My Dad Laugh in One Month: నవంబర్ 19న అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. ఈ ఓటమితో సొంత గ‌డ్డ‌పై రెండోసారి క‌ప్పు అనుకోవాలనుకున్న టీమిండియా ఆశలు అడియాస‌ల‌య్యాయి. భార‌త జ‌ట్టు అనూహ్య ఓట‌మితో భారత అభిమానులే కాకుండా.. ఆట‌గాళ్లు కూడా కన్నీటిప‌ర్యంత‌మ‌య్యారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మైదానంలోనే ఎంతో భావోద్వేగానికి గురయ్యాడు. రోహిత్ క‌న్నీళ్లను దిగ‌మింగిన దృశ్యాలు ప్ర‌తి భార‌తీయుడిని క‌దిలించాయి.

ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో ఓడిన రోహిత్ సేనకు మాజీ క్రికెట‌ర్ల‌తో పాటు అభిమానులు బాస‌ట‌గా నిలిచారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా హిట్‌మ్యాన్ కూతురు స‌మైరాకు సంబందించిన ఓ పాత వీడియో ఒక‌టి ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది. స‌మైరా త‌న త‌ల్లి రితికాతో క‌లిసి వెళుతుండగా.. రిపోర్టర్స్ రోహిత్ గురించి అడుగుతారు. డాడీ ఎక్కడ ఉన్నాడు అని అడగ్గా.. గ‌దిలో ఉన్నాడని సమాధానం ఇస్తుంది. ఇప్పుడు ఎలా ఉన్నాడు అని అడిగితే.. పాజిటివ్‌గానే ఉన్నాడు, మ‌రొక నెల‌లో మ‌ళ్లీ న‌వ్వుతాడు అని స‌మైరా చెప్పింది.

Also Read: Navdeep Saini Marriage: ప్రేయ‌సిని పెళ్లాడిన టీమిండియా క్రికెటర్!

12 ఏళ్ల త‌ర్వాత స్వ‌దేశంలో జ‌రిగిన‌ ప్ర‌పంచక‌ప్‌లో రోహిత్ శర్మ చెలరేగాడు. 597 ప‌రుగుల‌తో టోర్నీ రెండో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. అంతేకాదు ఈ ప్ర‌పంచక‌ప్‌లో అత్య‌ధిక ర‌న్స్ బాదిన‌ కెప్టెన్‌గా కూడా రోహిత్ రికార్డు నెల‌కొల్పాడు. లీగ్ ద‌శ‌ నుంచి హిట్‌మ్యాన్ ప్రత్యర్థి బౌలర్లపై ఇన్నింగ్స్ ఆరంభంలోనే విరుచుకుపడ్డాడు. దాంతో మిగతా బ్యాటర్స్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసేందుకు అవకాశం లభించింది. ఫైన‌ల్లో కూడా ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగిన రోహిత్.. 47 ప‌రుగులు చేశాడు. రోహిత్ పెవిలియన్ చేరాక.. భారత్ ఇన్నింగ్స్ లో వేగం తగ్గింది. చివరకు 240 పరుగులు మాత్రమే చేసింది.

Exit mobile version