Rohit Sharma World Record: టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన ఘనత అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 50వ సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో సెంచరీ చేయడంతో ఈ రికార్డు హిట్‌మ్యాన్ అందుకున్నాడు. టెస్టుల్లో 12, వన్డేల్లో 33, టీ20ల్లో ఐదు శతకాలు బాదాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో ఐదు లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా రోహిత్ ఉన్నాడు. ఇప్పటివరకూఈ రికార్డు ఎవరి వల్లా సాధ్యం కాలేదు.
ఆస్ట్రేలియాలో అత్యధిక వన్డే సెంచరీలు చేసిన విదేశీ బ్యాటర్‌గా మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. రోహిత్ 33 ఇన్నింగ్స్‌లలో 6 శతకాలు చేశాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ (32 ఇన్నింగ్స్‌లలో 5 సెంచరీలు), కుమార్ సంగక్కర (49 ఇన్నింగ్స్‌లలో 5 సెంచరీలు)లు ఉన్నారు. ఇక ఓ ప్రత్యర్థిపై అత్యధిక వన్డే శతకాలు బాదిన జాబితాలో హిట్‌మ్యాన్ నాలుగో స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ శ్రీలంకపై 10 శతకాలు చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లీ వెస్టిండీస్ జట్టుపై 9, సచిన్ టెండూల్కర్ ఆస్ట్రేలియాపై 9, రోహిత్ శర్మ ఆస్ట్రేలియాపై సెంచరీలు చేశారు.
Also Read: Rohit-Kohli: సిడ్నీలో దుమ్ములేపిన రోహిత్, కోహ్లీ.. ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం!
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ నిర్ధేశించిన 237 పరుగుల లక్ష్యాన్ని భారత్ 38.3 ఓవర్లలో ఒకే వికెట్ కోల్పోయి ఛేదించింది. సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (74; 81 బంతుల్లో, 7 ఫోర్లు) రాణించారు. రోకో చెలరేగడంతో ఆసీస్ బౌలర్లు తేలిపోయారు. శుభ్‌మన్ గిల్ (24) మంచి ఆరంభం ఇచ్చినా భారీ స్కోర్ చేయలేకపోయాడు. టీ20 సిరీస్ అక్టోబర్ 29 నుంచి ప్రారంభం కానుంది.
