NTV Telugu Site icon

Rohit Sharma Test Record: 146 ఏళ్ల టెస్ట్ చరిత్ర.. ‘ఒకే ఒక్కడు’గా రోహిత్ శర్మ!

Rohit Sharma Test Shot

Rohit Sharma Test Shot

Team India Captain Rohit Sharma Becomes First Batter In Test History: అంతర్జాతీయ టెస్టు చరిత్రలో టీమిండియా కెప్టెన్‌, ఓపెనర్ రోహిత్‌ శర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టెస్టు క్రికెట్‌లో వరసగా అత్యధిక ఇన్నింగ్స్‌లలో రెండు అంకెల స్కోర్ చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ట్రినిడాడ్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన హిట్‌మ్యాన్‌ ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ క్రమంలోనే శ్రీలంక మాజీ కెప్టెన్ మహేలా జయవర్ధనే రికార్డు బద్దలు కొట్టాడు.

వరుసగా అత్యధిక ఇన్నింగ్స్‌ల్లో డబుల్ డిజిట్‌ స్కోరు చేసిన రికార్డు నిన్నటివరకు మహేలా జయవర్ధనే పేరుపై ఉంది. జయవర్ధనే వరుసగా 29 ఇన్నింగ్స్‌ల్లో రెండంకెల స్కోరు నమోదు చేశాడు. ఇప్పుడా రికార్డును హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మ అధిగమించాడు. హిట్‌మ్యాన్‌ వరుసగా 30 ఇన్నింగ్స్‌ల్లో రెండు అంకెల స్కోర్ అందుకున్నాడు. దాంతో 146 ఏళ్ల టెస్ట్ చరిత్రలో ఈ రికార్డు సాధించిన ‘ఒకే ఒక్కడు’గా రోహిత్ రికార్డుల్లోకి ఎక్కాడు.

Also Read: Harmanpreet Kaur: భారత క్రికెట్‌కు చెడ్డ పేరు వచ్చింది.. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి: మదన్ లాల్

వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు ముందు డబ్ల్యూటీసీ 2023 ఫైనల్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా.. ఇలా వరుసగా టెస్టులు రోహిత్ శర్మ ఆడాడు. గత 30 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ రెండంకెల స్కోర్ చేస్తూనే ఉన్నాడు. ఒక్కసారి కూడా డకౌట్ కాకపోవడం విశేషం. రోహిత్ స్కోర్లు (Consecutive Test Inning without a Single Digit Score) ఇలా ఉన్నాయి. 12, 161, 26, 66, 25*, 49, 34, 30, 36, 12*, 83, 21, 19, 59, 11, 127, 29, 15, 15, 46, 120, 32, 12, 12, 35, 15, 43, 103, 80, 57లుగా ఉన్నాయి. ఇందులో 4 సెంచరీలు, 5 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.

భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. మొదటి టెస్టులో సెంచరీ చేసిన రోహిత్.. రెండో టెస్టులోని రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు బాదాడు. ఓవరాల్‌గా ఈ సిరీస్‌లో రోహిత్‌ 240 పరుగులు చేశాడు. ఇక యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌తో కలిసి హిట్‌మ్యాన్‌ అద్భుతమైన భాగస్వామ్యాలను నిర్మిస్తున్నాడు. వీరిద్దరూ కలిసి విండీస్‌పై 466 పరుగులు చేశారు. రెండు టెస్టుల సిరీస్‌లో అంతర్జాతీయంగా ఇది మూడో అత్యధిక ఓపెనింగ్‌ పార్టనర్‌షిప్‌. దక్షిణాఫ్రికా ప్లేయర్స్ గ్రేమ్‌ స్మిత్-నీల్ మెకంజీ 2008లో బంగ్లాపై 479 పరుగులు చేశారు.

Also Read: Lectrix EV Scooter Launch: ఎథర్‌, ఓలాకు పోటీగా.. మార్కెట్‌లోకి సరికొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌!