Rohit Sharma: బంగ్లాదేశ్‌తో మ్యాచ్.. వివాదంలో రోహిత్ శర్మ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma Issued 3 Traffic Challans For Over Speed ahead of IND vs BAN Match: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా నేడు బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు పూణే ట్రాఫిక్ పోలీసులు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఊహించని షాక్ ఇచ్చారు. ముంబై-పూణే హైవేపై పరిమితికి మించిన వేగంతో కారును నడిపినందుకు రోహిత్‌కు చలాన్లు విధించారు. హిట్‌మ్యాన్ గంటకు 200 కిమీ కంటే ఎక్కువ వేగంతో డ్రైవింగ్ చేసినట్లు సమాచారం తెలుస్తోంది.
అక్టోబర్ 14న పాకిస్తాన్‌తో మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లకు 5 రోజుల బ్రేక్ లభించింది. పాక్ మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అహ్మదాబాద్ నుంచి హెలిక్యాప్టర్‌లో ముంబైకి చేరుకున్నాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు రెండు రోజుల పాటు కుటుబంతో కలిసి గడిపిన రోహిత్.. పూణేలో భారత జట్టుతో కలిసేందుకు ముంబై నుంచి తన లంబోర్గిని ఉరుస్ కారులో బయలుదేరాడు. ముంబై-పూణే హైవేపై రోహిత్ పరిమితికి మించిన వేగంతో దూసుకుపోయాడట. ఒక దశలో రోహిత్ కారు 215 కిమీ వేగాన్ని అందుకుందట. వేర్వేరు ప్రదేశాల్లో పరిమితికి మించిన వేగంతో కారు వెళ్లినందుకు కారు యజమాని అయిన రోహిత్‌కు ట్రాఫిక్ పోలీసులు మూడు చలానాలు వేశారు.
Also Read
Also Read: Nandamuri Balakrishna Fans: ఊగిపోతున్న ఫాన్స్.. బాలయ్య బాబుకు ‘మాన్షన్ హౌస్’ అభిషేకం! అంతేకాదు..
వేగంగా వెళ్తున్న రోహిత్ శర్మ కారును ఓ పోలీస్ ఉన్నతాధికారి అడ్డుకున్నాడట. పోలీసు ఎస్కార్ట్‌తో జట్టు బస్సులో ప్రయాణించాలని ఆ అధికారి సూచించారట. ఇక రోహిత్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన రోహిత్.. 217 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్‌పై కూడా హిట్‌మ్యాన్ చెలరేగాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. ప్రపంచకప్‌లో రోహిత్ అత్యధికంగా 7 సెంచరీలు బాదిన విషయం తెలిసిందే. రోహిత్ ఫామ్ చూస్తుంటే.. ఈ ప్రపంచకప్‌లోనే మరో 2-3 శతకాలు బాదినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!