Rohit Sharma: “నన్ను క్షమించు..” మహిళా అభిమానికి ‘హిట్ మ్యాన్’ స్పెషల్ రిక్వెస్ట్..!
- కోల్‌కతాలో మహిళా అభిమానికి రోహిత్ శర్మ క్షమాపణ
- సోషల్ వీడియో వైరల్
- ఈడెన్ గార్డెన్స్‌లో KKRతో మ్యాచ్ అనంతరం ఘటన
- . హోటల్ బయట రోహిత్ కోసం ఎదురు చూసిన యువతి
- భద్రతా హడావుడిలో ఆమెను గమనించకుండా వెళ్లిపోయిన రోహిత్.
- వైరల్ వీడియో చూసిన తర్వాత ప్రత్యేకంగా స్పందించిన ‘హిట్ మ్యాన్’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma: ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన సంగతి తెలిసిందే. అయితే మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం మరోసారి అభిమానుల మనసు గెలిచే విధంగా మాట్లాడాడు. కోల్‌కతాలో జరిగిన ఓ ఘటనపై ఓ మహిళా అభిమానికి స్వయంగా క్షమాపణ చెప్పిన రోహిత్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మే 20న ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అయితే మ్యాచ్ అనంతరం ముంబై జట్టు బస చేసిన హోటల్ బయట అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అందులో ఓ యువతి ప్రత్యేకంగా రోహిత్ శర్మను కలవాలని ఎంతోసేపు ఎదురు చూసింది. అయితే రోహిత్ బయటకు వచ్చిన సమయంలో అక్కడి హడావుడి, భద్రతా ఏర్పాట్ల మధ్య ఆమెను గమనించకుండా వెళ్లిపోయాడు. దీంతో ఆ యువతి భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం రోహిత్ దృష్టికి చేరింది.
Also Read
- BIS Certification: మొబైల్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కొత్త రూల్.. ఇక నాసిరకం టెంపర్డ్ గ్లాస్‌కు చెక్..!
- India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
- Bihar: బీహార్ లైంగిక వేధింపుల ఘటనలో నిందితుడి ఎన్కౌంటర్.. అసలు ఏం జరిగిందంటే..?
- Central Government Jobs: జేన్ జీకి ఈ మూడు ప్రభుత్వ ఉద్యోగాలంటే ఎందుకంత పిచ్చి? ఆసక్తికర విషయాలు..
దీనిపై స్పందించిన రోహిత్ శర్మ ప్రత్యేక వీడియో ద్వారా ఆ అభిమానికి క్షమాపణలు చెప్పాడు. “అక్కడి గందరగోళంలో ప్రతి ఒక్కరిని గమనించడం సాధ్యం కాదు. నిన్ను బాధపెట్టాలనే ఉద్దేశం అసలు లేదు” అని తెలిపాడు. అంతేకాకుండా.. “తర్వాత మరోసారి తాను కోల్‌కతా వచ్చినప్పుడు తప్పకుండా నిన్ను వ్యక్తిగతంగా కలుస్తాను” అంటూ ఆమెకు హామీ ఇచ్చాడు. రోహిత్ చేసిన ఈ జెశ్చర్ అభిమానుల మనుసుని గెలుచుకుంది. సాధారణ అభిమానిని కూడా పట్టించుకుని స్పందించడం గొప్ప విషయమంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. కేకేఆర్‌తో జరిగిన పోరులో రోహిత్ శర్మ నిరాశపరిచాడు. 13 బంతుల్లో 15 పరుగులు చేసిన అతడు సౌరభ్ దూబే బౌలింగ్‌లో కామెరాన్ గ్రీన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్ 147 పరుగులకే పరిమితమైంది. లక్ష్య చేధనలో కోల్‌కతా నైట్ రైడర్స్ సునాయాసంగా ఆడింది. మనీష్ పాండే, రోవ్‌మన్ పావెల్ కలిసి 64 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి జట్టును విజయం వైపు నడిపించారు. కేకేఆర్ 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఐపీఎల్ 2026లో రోహిత్ శర్మ 8 ఇన్నింగ్స్‌ల్లో 283 పరుగులు నమోదు చేశాడు. అయితే హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. మొత్తంగా చూస్తే, ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ పూర్తిగా విఫలమైంది. 13 మ్యాచ్‌ల్లో కేవలం 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగం ఆశించిన స్థాయిలో రాణించకపోవడం జట్టుకు పెద్ద దెబ్బ అయింది. దీంతో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి.
Rohit Sharma's special message for the fangirl from Kolkata! 💙✨
Proud of you IDOLO!!!! 🥹🫰👑 pic.twitter.com/5WMKb2kfT9
— Mamta Jaipal (@ImMD264) May 23, 2026
తాజావార్తలు
-
BIS Certification: మొబైల్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కొత్త రూల్.. ఇక నాసిరకం టెంపర్డ్ గ్లాస్‌కు చెక్..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Bihar: బీహార్ లైంగిక వేధింపుల ఘటనలో నిందితుడి ఎన్కౌంటర్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Central Government Jobs: జేన్ జీకి ఈ మూడు ప్రభుత్వ ఉద్యోగాలంటే ఎందుకంత పిచ్చి? ఆసక్తికర విషయాలు..
-
Smriti Mandhana History: స్మృతి మంధాన వరల్డ్ రికార్డు.. మహిళల క్రికెట్లో ఇదే తొలిసారి!
ట్రెండింగ్
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!