Ajit Pawar Plane Crash: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడిపై రోహిత్ పవార్ సంచలన ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajit Pawar Plane Crash: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న అజిత్ పవార్ విమాన ప్రమాదంలో ప్రాణాలు విడిచిన ఘటనపై అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి.. ఇప్పటికే అజిత్ పవార్ కుటుంబ సభ్యులు.. ఈ ఘటనపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు.. తాజాగా, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుపై సంచలన ఆరోపణలు అజిత్ పవార్ మేనల్లుడు రోహిత్ పవార్.. అజిత్ పవార్ విమాన ప్రమాదంపై దర్యాప్తు పారదర్శకంగా జరగాలంటే రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాల్సిందే అని డిమాండ్ చేశారు.. అజిత్ పవార్ ప్రయాణించిన లేజర్ జెట్ విమాన యజమాని VSR సంస్థకి టీడీపీతో సంబంధాలున్నాయని పేర్కొన్నారు రోహిత్ పవార్..
మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతికి కారణమైన విమాన ప్రమాదంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ ప్రమాద దర్యాప్తు తీరును తప్పుబడుతూ ఆయన మేనల్లుడు, ఎన్‌సిపి (ఎస్పీ) ఎమ్మెల్యే రోహిత్ పవార్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో పారదర్శకత ఉండాలంటే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శరద్ పవార్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రోహిత్ పవార్ మాట్లాడుతూ, ఈ ప్రమాదంలో లోతైన కుట్ర దాగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
Also Read
- Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- Google Earthquake Alert: భూకంపానికి ముందే గూగుల్ అలర్ట్.. కాంతి వేగంతో మొబైల్ స్క్రీన్లపైకి వార్నింగ్.. కానీ..
- Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. 'నేరేడుపండు జ్యూస్' ఇంట్లోనే చేసేయండి ఇలా.!
ఆయన లేవనెత్తిన ప్రధాన అంశాలు ఇవే:
TDPతో సంబంధాలు: అజిత్ పవార్ ప్రయాణించిన ‘లియర్‌జెట్ 45’ విమాన ఆపరేటర్ అయిన VSR వెంచర్స్ సంస్థకు, తెలుగుదేశం పార్టీ (TDP) అగ్రనేతలతో ఆర్థిక మరియు రాజకీయ సంబంధాలు ఉన్నాయని రోహిత్ పవార్ ఆరోపించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అదే పార్టీకి చెందిన వారు కావడంతో, దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగదని ఆయన వాదించారు.
ప్రధానికి లేఖ: ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మరియు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు రోహిత్ పవార్ లేఖలు రాశారు. అయితే, విమానంలోని డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ (DFDR) సురక్షితంగా ఉండి, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (CVR) మాత్రం థర్మల్ డ్యామేజ్‌కు గురికావడంపై ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. ఒకే చోట ఉండే రెండు పరికరాల్లో ఒకటి మాత్రమే ఎలా దెబ్బతింటుందని ఆయన ప్రశ్నించారు.
విమానయాన సంస్థ నిబంధనలను బేఖాతరు చేసిందని రోహిత్ పవార్ పేర్కొన్నారు.. డీజీసీఏ (DGCA) నిబంధనలకు విరుద్ధంగా, వేరే రకమైన విమానాల్లో శిక్షణ పొందిన పైలట్లను ఈ విమానానికి కేటాయించారని ఆరోపించారు. ఇక, విమానం ఇంజిన్ కాలపరిమితి కేవలం 85 గంటలు మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ, దానిని తక్కువగా చూపించి విమానాన్ని నడిపారని పేర్కొన్నారు. మరోవైపు.. రూ.35 కోట్ల విలువైన విమానానికి రూ.55 కోట్లకు బీమా చేయించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. దర్యాప్తుపై ప్రజల్లో నమ్మకం కలగాలంటే ప్రస్తుత కమిటీని రద్దు చేసి, కొత్త కమిటీని వేయాలని ఆయన కోరారు. ఆ కమిటీలో రిటైర్డ్ అధికారులు మరియు మాజీ న్యాయమూర్తులు ఉండాలి. ప్రతిపక్ష ప్రతినిధులు మరియు అజిత్ పవార్ కుటుంబ సభ్యులకు చోటు కల్పించాలి. ఒక నిర్దిష్ట కాలపరిమితిలోపు స్వతంత్ర దర్యాప్తు పూర్తి కావాలని డిమాండ్ చేశారు రోహిత్ పవార్..
తాజావార్తలు
-
iQOO Neo11s: ఐకూ Neo11s వచ్చేస్తోంది.. 8000mAh భారీ బ్యాటరీ, 144Hz 2K డిస్ప్లేతో గేమర్లకు కొత్త పవర్‌హౌస్!
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
OG Universe : OG – 2 ఊచకోతకు శ్రీకారం చుట్టిన పవర్ స్టార్ – సుజీత్
-
Akash Deep Wedding: ధోనీ, కోహ్లీ, రోహిత్ వస్తే నా పెళ్లి ఆగిపోతుంది.. ఆకాశ్ దీప్ కామెంట్స్ వైరల్!
-
Sana Malik: పాకిస్తాన్‌లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్‌టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..