INDvsAUS 1st Test: మెరిసిన రోహిత్, జడేజా, అక్షర్..తొలి టెస్టుపై పట్టుబిగిస్తున్న ఇండియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగిస్తోంది. మొదటి రోజు బౌలింగ్‌తో అదరగొట్టిన భారత్.. రెండో రోజు బ్యాటింగ్‌లోనూ జోరు చూపించింది. దీంతో మొదటి టెస్టులో విజయం దిశగా సాగుతోంది. ఓవర్‌నైట్ స్కోరు 77/1తో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 321 రన్స్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (120) అద్భుత సెంచరీతో అదరగొట్టగా. . జడేజా (66 నాటౌట్), అక్షర్ పటేల్ (52 నాటౌట్) హాఫ్ సెంచరీలు చేసి శతకం వైపు దూసుకెళ్తున్నారు. దీంతో ఇప్పటికే తొలి ఇన్నింగ్స్‌లో 144 రన్స్ లీడ్ సాధించింది టీమిండియా.
పట్టుదలగా బ్యాటింగ్
Also Read
- Women's T20 World Cup 2026కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
- Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
- 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
- YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
ఆసీస్ బ్యాటర్లు తడబడ్డ పిచ్‌పై భారత బ్యాటర్లు దుమ్మురేపారు. మొదట కెప్టెన్ రోహిత్ ప్రత్యర్థి బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చూపించాడు. ఫోర్లు, సిక్సర్లు బాదుతూనే అవసరమైన సమయంలో సంయమనం పాటిస్తూ బ్యాటింగ్ కొనసాగించాడు. ఓ ఎండ్‌లో అశ్విన్ (23), కోహ్లీ (12), పూజారా (7), సూర్యకుమార్ (8) ఇలా వరుస వికెట్లు పడుతున్నా తాను మాత్రం గొప్పగా పోరాడాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో తొమ్మిదో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అలాగే కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. అనంతరం ఇతడికి బౌలింగ్‌లో అదరగొట్టిన జడేజా తోడయ్యాడు. ఇతడు కూడా ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. రోహిత్ ఔటయ్యాక.. జడేజాతో కలిసిన అక్షర్ పటేల్ సూపర్ బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 321 రన్స్ చేసింది. జడేజా (66 నాటౌట్), అక్షర్ (52 నాటౌట్) క్రీజులో ఉన్నారు.
Also Read: Kethireddy Pedda Reddy: ఇసుక రీచ్ వద్ద జేసీ ఆందోళన.. ఎమ్మెల్యే పెద్దారెడ్డి కౌంటర్
తాజావార్తలు
-
Women’s T20 World Cup 2026కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్‌ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
-
అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!