NTV Telugu Site icon

Rohan Bopanna: చరిత్ర సృష్టించిన రోహన్ బోపన్న.. ఆస్ట్రేలియన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుపు

Rohan Bopanna

Rohan Bopanna

ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. భారత డబుల్స్ దిగ్గజం రోహన్ బోపన్న 43 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్ ను కైవసం చేసుకున్నాడు. రోహన్ బోపన్న-మాథ్యూ ఎబ్డెన్ జోడీ 7-6, 7-5తో ఇటాలియన్ జోడీ సిమోన్ బోలెల్లి, ఆండ్రియా వవసోరిని ఓడించి టైటిల్‌ను గెలుచుకున్నారు. అతను 2022లో మార్సెలో అరెవోలాతో కలిసి ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల డబుల్స్ ట్రోఫీని గెలుచుకున్న జీన్-జూలియన్ రోజర్ రికార్డును బద్దలు కొట్టాడు. రోహన్ బోపన్న కెరీర్ లో ఇదే తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం.

Read Also: TTD: శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి నెల విశేష పర్వదినాలు ఇవే..

తాజాగా పురుషుల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో రోహన్ బోపన్న నంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డుకు కూడా ఎంపికయ్యారు. రోహన్ బోపన్న 43 ఏళ్ల 329 రోజుల వయసులో ఛాంపియన్‌గా నిలిచాడు. పురుషుల డబుల్స్‌లో ఎబ్డెన్‌కిది రెండో టైటిల్‌. అతను ఇంతకుముందు 2022లో ఆస్ట్రేలియన్ మాక్స్ పర్సెల్‌తో కలిసి వింబుల్డన్ గెలిచాడు. గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలిచిన మూడో భారత ఆటగాడిగా రోహన్‌ బోపన్న నిలిచాడు. ఇంతకు ముందు పురుషుల టెన్నిస్‌లో లియాండర్ పేస్, మహేశ్ భూపతి మాత్రమే భారత్ తరఫున మేజర్ టైటిళ్లు సాధించగా, మహిళల టెన్నిస్‌లో సానియా మీర్జా ఈ ఘనత సాధించింది.

Read Also: Trivikram: ఎట్టకేలకు గుంటూరు కారం హడావుడి తరువాత దర్శనమిచ్చిన గురూజీ

ఈ విజయం అందుకున్న బోపన్న-ఎబ్డెన్‌ల జోడీకి ట్రోఫీతో పాటు రూ.6.06 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. మరోవైపు.. మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను అరియానా సబలెంకా సొంతం చేసుకుంది. ఫైనల్లో చైనాకు చెందిన ఝెంగ్ కిన్వెన్‌ను 6-3, 6-2తో సబలెంకా చిత్తు చేసింది.