Site icon NTV Telugu

Rohan Bopanna: టెన్నిస్ కెరీర్‌కు గుడ్ బై.. రిటైర్మెంట్ ప్రకటించిన రోహన్ బోపన్నా

Rohan Bopanna

Rohan Bopanna

భారతీయ టెన్నిస్ లెజెండ్, రెండు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ రోహన్ బోపన్నా తన ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్‌కు వీడ్కోలు పలికారు. 20 సంవత్సరాలకు పైగా కొనసాగిన ఈ అద్భుతమైన ప్రయాణానికి ముగింపు పలికిన ఈ 45 ఏళ్ల అథ్లెట్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్టును పోస్టు చేశారు. బోపన్న చివరిసారిగా పారిస్ మాస్టర్స్ 1000లో అలెగ్జాండర్ బుబ్లిక్‌తో కలిసి డబుల్స్ మ్యాచ్ ఆడాడు. నా జీవితానికి అర్థం ఇచ్చిన ఈ ఆటకు.. మర్చిపోలేని రీతిలో 20 సంవత్సరాల పాటు టెన్నిస్‌ కెరీర్‌లో కొనసాగిన తర్వాత ఇప్పుడు నేను అధికారికంగా రాకెట్‌ను వదులుతున్నాను అని పోస్టులో రాసుకొచ్చారు.

Also Read:Ponnam Prabhakar : కేటీఆర్‌పై సుమోటోగా కేసు నమోదు చేయాలి

శారీరకంగా బలపడేందుకు కూర్గ్‌ (కర్ణాటకలో)లో చెక్కలు కొట్టడం మొదలుకుని ప్రపంచంలోని ప్రసిద్ధ మైదానాల్లో ఆడిన అనుభవం వరకు.. ఇదంతా కలలా ఉంది. భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం నా జీవితంలో నాకు దక్కిన అత్యున్నత గౌరవం అని బోపన్న తెలిపారు. తాను పోటీ ఆటల నుంచి తప్పుకుంటున్నానని, తన టెన్నిస్‌ ప్రయాణం ముగియలేదని బోపన్న అన్నారు. రిటైర్ అయినా, భారతదేశంలో టెన్నిస్ అభివృద్ధికి తోడ్పడుతానని చెప్పారు.

Also Read:Ambani Halloween Party: అంబానీ ఇంట దయ్యాల పార్టీ.. వైరల్ అవుతున్న ఫోటోలు

తాను చిన్న పట్టణాల నుంచి కలలు కంటూ వచ్చే యువ క్రీడాకారుల్లో నమ్మకాన్ని కలిగించాలనుకుంటున్నానని తెలిపాడు. బోపన్న పలు ఏటీపీ టైటిల్స్‌ గెలిచాడు. డేవిస్‌ కప్‌, ఒలింపిక్స్‌లలో కూడా భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 2024 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో విజయం సాధించిన తర్వాత, డబుల్స్‌ విభాగంలో ప్రపంచ నంబర్‌ 1గా నిలిచాడు. భారత టెన్నిస్ అభిమానులకు ఒక యుగం ముగిసినట్లే.. కానీ బోపన్న లెగసీ ఎప్పటికీ గుర్తుంటుంది.

Exit mobile version