Toxic: ‘టాక్సిక్’ లో రోమాంటిక్ సీన్స్ పై యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘టాక్సిక్’. ‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇది 1950-70ల కాలంలో గోవా బ్యాక్‌డ్రాప్‌లో జరిగే డ్రగ్ మాఫియా కథ అని సమాచారం. ఈ సినిమాలో నయనతార, కియారా అద్వానీ వంటి స్టార్ హీరోయిన్లు నటిస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన సినిమాకాన్ వేడుకలో యశ్ మాట్లాడుతూ, ఈ సినిమాలో యాక్షన్, ఎమోషన్స్ గతంలో ఎన్నడూ చూడని విధంగా ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు.
సాధారణంగా గ్యాంగ్‌స్టర్ కథలను పురుష దర్శకులే అద్భుతంగా తీయగలరనే నమ్మకం ఇండస్ట్రీలో ఉంది. అయితే గీతూ మోహన్‌దాస్ ఆ నమ్మకాన్ని పటాపంచలు చేయబోతున్నారని యశ్ పేర్కొన్నారు.. ‘గీతూ ఒక గొప్ప రచయిత్రి. ఈ కథను ఆమె చూసిన కోణం చాలా కొత్తగా ఉంది. శృంగార సన్నివేశాల నుంచి రక్తపాతం చిందించే యాక్షన్ సీన్స్ వరకు.. ప్రతి దానిలోనూ ఒక రకమైన స్పష్టత, సున్నితత్వం కనిపిస్తాయి. ఒక మహిళా దర్శకురాలు అన్ని రకాల భావోద్వేగాలను ఇంత పవర్‌ఫుల్‌గా ప్రజెంట్ చేయగలరా అని ఆమెతో పని చేశాకే నాకు అర్థమైంది’ అని యశ్ ప్రశంసించారు. అలాగే ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో యాక్షన్ సన్నివేశాలు చాలా విభిన్నంగా, రియలిస్టిక్ గా ఉండబోతున్నాయని యశ్ హింట్ ఇచ్చారు. కాగా ఈ చిత్రం ఏప్రిల్ 10, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
Also Read
- Onion Price Hike: కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధరలు.. కిలో రూ.70 వరకు విక్రయం!
- Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
- Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
- IND vs SL 2nd Test: క్లీన్ స్వీప్‌పై భారత్ కన్ను.. శ్రీలంకకు మళ్లీ గాయాల దెబ్బ..
తాజావార్తలు
-
Taapsee vs Kangana: ‘పెంపకం’ వ్యాఖ్యలతో మళ్లీ రాజుకున్న కంగనా-తాప్సీ వార్.. ఇన్‌స్టాలో ఫైర్ బ్రాండ్ కౌంటర్!
-
Onion Price Hike: కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధరలు.. కిలో రూ.70 వరకు విక్రయం!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Japan Earthquake: జపాన్‌లో 5.9 తీవ్రతతో భూకంపం.. 20 మందికి గాయాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం
-
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!