NTV Telugu Site icon

Rabinhood : 10 మిలియన్ వ్యూస్‌తో దుమ్ములేపుతున్న ‘రాబిన్‌హుడ్’

New Project 2024 11 16t133407.345

New Project 2024 11 16t133407.345

Rabinhood : హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబోలో యాక్షన్, కామెడీ జానర్లో రాబిన్‌హుడ్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, క్యారెక్టర్‌ ఇంట్రడక్షన్‌ గ్లింప్స్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ క్రేజీ హై-బడ్జెట్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. రీసెంట్ గా అడ్వెంచర్ అండ్ హైలీ ఎంటర్ టైనింగ్ టీజర్‌ను రిలీజ్ చేయడంతో మేకర్స్ రియల్ ప్రమోషన్‌లను ప్రారంభించారు. టీజర్ పవర్ ఫుల్ వాయిస్‌ఓవర్‌తో స్టార్ట్ అయింది. నితిన్ హై-ఫై ఇళ్లను లక్ష్యంగా చేసుకుని, అడ్వెంచరస్ దోపిడీలను చేసే మోడరన్ రాబిన్‌హుడ్‌గా పరిచయం అయ్యారు. అతనికి ప్రత్యేకమైన ఎజెండా లేదా నిర్దిష్ట కారణం ఏమీ లేదు, అతని ఏకైక మోటివేషన్ డబ్బు. ఇలాంటి సిట్యువేషన్స్ లో అతను పవర్ ఫుల్ కుటుంబ నేపథ్యం ఉన్న శ్రీలీలని ఇష్టపడతాడు. ఇది ఇప్పటికే డేంజర్ లో వున్న అతని లైఫ్ ని మరింత కాంప్లికేట్ చేస్తుంది. వెంకీ కుడుముల ప్రతి ప్రమోషన్ మెటీరియల్‌లో నెరేటివ్ లో తనదైన మార్క్ చూపిస్తున్నారు.

Read Also:AP Assembly: భారీ నీటి ప్రాజెక్ట్‌లకు రూ.15,513 కోట్లు.. చిన్న ప్రాజెక్టులకు రూ.1,227 కోట్లు..

నితిన్ రాబిన్‌హుడ్‌గా అదరగొట్టారు, డిఫరెంట్ లుక్‌లలో డైనమిక్ పెర్ఫార్మెన్స్ అందించాడు. ఒక సీన్ నిజమైన దేశభక్తుడు ఏజెంట్ రాబిన్‌హుడ్, మరో సీన్ లో అరబ్ షేక్‌గా కనిపించి తీరు విశేషంగా అలరించింది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్ లో ఉన్నాయి. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రానికి నిర్మాతలు. కోటి ఎడిటర్, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదల కానున్న సినిమాపై ఈ టీజర్ అంచనాలను పెంచింది. ఇక ఈ టీజర్‌కు ప్రేక్షకుల నుండి సాలిడ్ రెస్పాన్స్ దక్కుతోంది. ఈ టీజర్ రిలీజ్ అయిన 24 గంటల్లోనే ఏకంగా 10 మిలియన్ వ్యూస్ మార్క్‌ను క్రాస్ చేసింది. అంతేగాక, ఈ టీజర్ యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతోంది. ఈ టీజర్‌లో చిత్రంలోని భారీ క్యాస్టింగ్, జీవి.ప్రకాష్ కుమార్ ఎంగేజింగ్ బీజిఎం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో షైన్ టామ్ చాకో, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, మీమ్ గోపి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Read Also:Sangareddy Crime: సంగారెడ్డి గురుకుల పాఠశాలలో విద్యార్థిని మృతి.. కుటుంబ సభ్యుల ఆందోళన