Site icon NTV Telugu

Pope Leo XIV: కొత్త పోప్‌గా రాబర్ట్ ప్రెవోస్ట్ ఎన్నిక.. ఇంతకీ ఈయన ఎవరు?

Robert Prevost

Robert Prevost

ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల మంది క్యాథలిక్‌లకు అత్యున్నత మతాధికారిగా సేవలు అందించబోయే తదుపరి పోప్‌ను ప్రకటించారు. కాథలిక్ చర్చి కార్డినల్స్ తదుపరి పోప్‌ను ఎన్నుకున్నారు. సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో సీనియర్ కార్డినల్స్ అమెరికాకు చెందిన రాబర్ట్ ప్రీవోస్ట్ కాథలిక్ చర్చికి కొత్త పోప్ అని ప్రకటిచారు. ప్రీవోస్ట్ ను పోప్ లియో XIV(లియో-14)గా పిలుస్తారు. రాబర్ట్ ప్రీవోస్ట్ మొదటి అమెరికన్ పోప్. ఆచారం ప్రకారం.. సిస్టీన్ చాపెల్ చిమ్నీ నుంచి తెల్లటి పొగ వచ్చిన దాదాపు 70 నిమిషాల తర్వాత.. సెయింట్ పీటర్స్ బసిలికా సెంట్రల్ బాల్కనీలో పోప్ లియో కనిపించారు. 133 మంది కార్డినల్ ఎలక్టర్లు కాథలిక్ చర్చికి కొత్త నాయకుడిని ఎన్నుకున్నారని స్పష్టమైంది. కొత్త పోప్‌గా రాబర్ట్ ప్రీవోస్ట్ పేరును ఫ్రాన్స్‌కు చెందిన కార్డినల్ డొమినిక్ మాంబెర్టి ప్రకటించారు.

READ MORE: India-Pakistan War: పాక్ దాడిలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.. భారత రక్షణశాఖ స్పష్టం..

రాబర్ట్ ప్రీవోస్ట్ ఎవరు?
69 ఏళ్ల రాబర్ట్ ప్రీవోస్ట్ చికాగోకు చెందినవారు. ప్రెవోస్ట్ తన కెరీర్‌లో ఎక్కువ భాగం పెరూలో మిషనరీగా గడిపారు. 2023లో కార్డినల్ అయ్యారు. మీడియాలో తక్కువగా కనిపించారు. పెరూలో బిషప్‌గా కూడా సేవలందించారు. దాదాపు దశాబ్దకాలం పాటు పెరూలోని ట్రుజిల్లోలో పనిచేసిన ప్రీవోస్ట్, ఆ తర్వాత 2014 నుంచి 2023 వరకు పెరూలోని మరో నగరమైన చక్లాయోకు బిషప్‌గా వ్యవహరించారు. ఆయనకు 2015 నుంచి పెరూ పౌరసత్వం కూడా ఉంది.

READ MORE: India-Pakistan War: పాకిస్థాన్ ప్రధాని ఇంటి సమీపంలో పేలుళ్లు.. షరీఫ్‌ను తరలించిన పాక్ సైన్యం..

కొత్త పోప్‌గా సెయింట్ పీటర్స్ బేసిలికా ప్రార్థనామందిరం బాల్కనీ నుంచి తొలిసారిగా ప్రసంగించారు. “మీ అందరికీ శాంతి కలుగుగాక” అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. “ఇది పునరుత్థానం చెందిన క్రీస్తు తొలి పలుకులు, దేవుని కోసం తన జీవితాన్ని అర్పించిన మంచి కాపరి మాటలివి. ఈ శాంతి సందేశం మన హృదయాల్లోకి, మన కుటుంబాల్లోకి ప్రవేశించాలని నేను ఆకాంక్షిస్తున్నాను” అని ఆయన పేర్కొన్నారు. 133 మంది ఓటర్లలో మూడింట రెండొంతుల ఓట్లు సాధించిన రాబర్ట్ ప్రీవోస్ట్ పోప్‌గా ఎన్నికయ్యారు.

Exit mobile version