Pope Leo XIV: కొత్త పోప్‌గా రాబర్ట్ ప్రెవోస్ట్ ఎన్నిక.. ఇంతకీ ఈయన ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల మంది క్యాథలిక్‌లకు అత్యున్నత మతాధికారిగా సేవలు అందించబోయే తదుపరి పోప్‌ను ప్రకటించారు. కాథలిక్ చర్చి కార్డినల్స్ తదుపరి పోప్‌ను ఎన్నుకున్నారు. సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో సీనియర్ కార్డినల్స్ అమెరికాకు చెందిన రాబర్ట్ ప్రీవోస్ట్ కాథలిక్ చర్చికి కొత్త పోప్ అని ప్రకటిచారు. ప్రీవోస్ట్ ను పోప్ లియో XIV(లియో-14)గా పిలుస్తారు. రాబర్ట్ ప్రీవోస్ట్ మొదటి అమెరికన్ పోప్. ఆచారం ప్రకారం.. సిస్టీన్ చాపెల్ చిమ్నీ నుంచి తెల్లటి పొగ వచ్చిన దాదాపు 70 నిమిషాల తర్వాత.. సెయింట్ పీటర్స్ బసిలికా సెంట్రల్ బాల్కనీలో పోప్ లియో కనిపించారు. 133 మంది కార్డినల్ ఎలక్టర్లు కాథలిక్ చర్చికి కొత్త నాయకుడిని ఎన్నుకున్నారని స్పష్టమైంది. కొత్త పోప్‌గా రాబర్ట్ ప్రీవోస్ట్ పేరును ఫ్రాన్స్‌కు చెందిన కార్డినల్ డొమినిక్ మాంబెర్టి ప్రకటించారు.
READ MORE: India-Pakistan War: పాక్ దాడిలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.. భారత రక్షణశాఖ స్పష్టం..
Also Read
రాబర్ట్ ప్రీవోస్ట్ ఎవరు?
69 ఏళ్ల రాబర్ట్ ప్రీవోస్ట్ చికాగోకు చెందినవారు. ప్రెవోస్ట్ తన కెరీర్లో ఎక్కువ భాగం పెరూలో మిషనరీగా గడిపారు. 2023లో కార్డినల్ అయ్యారు. మీడియాలో తక్కువగా కనిపించారు. పెరూలో బిషప్‌గా కూడా సేవలందించారు. దాదాపు దశాబ్దకాలం పాటు పెరూలోని ట్రుజిల్లోలో పనిచేసిన ప్రీవోస్ట్, ఆ తర్వాత 2014 నుంచి 2023 వరకు పెరూలోని మరో నగరమైన చక్లాయోకు బిషప్‌గా వ్యవహరించారు. ఆయనకు 2015 నుంచి పెరూ పౌరసత్వం కూడా ఉంది.
READ MORE: India-Pakistan War: పాకిస్థాన్ ప్రధాని ఇంటి సమీపంలో పేలుళ్లు.. షరీఫ్‌ను తరలించిన పాక్ సైన్యం..
కొత్త పోప్‌గా సెయింట్ పీటర్స్ బేసిలికా ప్రార్థనామందిరం బాల్కనీ నుంచి తొలిసారిగా ప్రసంగించారు. “మీ అందరికీ శాంతి కలుగుగాక” అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. “ఇది పునరుత్థానం చెందిన క్రీస్తు తొలి పలుకులు, దేవుని కోసం తన జీవితాన్ని అర్పించిన మంచి కాపరి మాటలివి. ఈ శాంతి సందేశం మన హృదయాల్లోకి, మన కుటుంబాల్లోకి ప్రవేశించాలని నేను ఆకాంక్షిస్తున్నాను” అని ఆయన పేర్కొన్నారు. 133 మంది ఓటర్లలో మూడింట రెండొంతుల ఓట్లు సాధించిన రాబర్ట్ ప్రీవోస్ట్ పోప్‌గా ఎన్నికయ్యారు.
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!