Site icon NTV Telugu

Robbery : దొంగతనానికి వచ్చి.. ఇంట్లోవాళ్లు లేచే సరికి

Security Guard Robbery

Security Guard Robbery

చోరీ కోసం వచ్చిన ఓ దొంగ అలికిడి కావడంతో బైకు, ఛార్జింగ్ పెట్టి ఉంచిన సెల్ ఫోన్, దుస్తులు, షూస్‌లను వదిలి పరారైన సంఘటన మహబూబాబాద్ జిల్లా కృష్ణ కాలనీలో చోటు. స్థానిక శ్రీ చైతన్య పాఠశాల ముందు తన బైక్ ను పార్క్ చేసి పాఠశాల పక్క ఇంట్లో కరెంటు ప్లగ్ ను తీసేశాడు. దీంతో ఆ ఇంట్లో కరెంటు పోవడంతో గాలి కోసం తలుపు తీశారు. పక్కన కరెంటు ఉంది.. ఇక్కడే కరెంటు లేదు అని పరిశీలిస్తుండగా ఓ వ్యక్తి పరుగులు తీశాడు. దీంతో దొంగగా భావించిన వారు 100 కి ఫోన్ చేశారు. పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు.. స్థానికులు మొత్తం గాలించారు.

Also Read : Summer Holidays: సమ్మర్ హాలిడేస్ పొడిగించండి.. ఏపీ ప్రభుత్వానికి విద్యార్థుల తల్లిదండ్రుల వినతి

దొంగతనానికి వచ్చిన వ్యక్తి తన బైకు , షూస్ ,బట్టలు , కళ్ళజోడు , చార్జింగ్ పెట్టి ఉంచిన సెల్ ఫోను వదిలి పారిపోయాడు. సీసీ కెమెరాలు , బైక్ ,సెల్ ఫోన్ సహాయంతో పోలీసులు గాలిస్తున్నారు. గత కొన్ని రోజు లు గా కృష్ణ కాలనీలో దొంగలు రెక్కీ లు నిర్వహిస్తున్నారు. వారం రోజుల క్రితం ఓ ఇంట్లో దొంగలు పడి ఐదున్నర తులాల బంగారు ఆభరణాలను అపహరించారు. దీంతో భయభ్రాంతులకు గురైన కాలనీవాసులు గత వారం రోజులుగా రాత్రి వేళల్లో కాలనీ లో గస్తీ నిర్వహిస్తున్నారు. పోలీసులు వెంటనే విచారణ చేసి దొంగలను పట్టుకోవాలని, రాత్రి వేళల్లో పెట్రోలింగ్ ను పెంచి ఇలాంటి సంఘటనలు మరలా జరగకుండా చూడాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

Exit mobile version