Site icon NTV Telugu

Robbery : దృష్టి మరల్చి బంగారు దుకాణాల్లో చోరీ

Arrest

Arrest

బంగారు దుకాణాలలో దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగను కె.పి.హెచ్.బి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూకట్‌పల్లి ఏసిపి వివరాలు వెల్లడించారు. భువనగిరి జిల్లా నాగయ్యపల్లి తండాకు చెందిన బానోతు భాస్కర్(21) బిల్డింగ్ మెటీరియల్ సప్లై చేస్తున్నాడు. క్రికెట్ బెట్టింగ్, ఆన్లైన్ రమ్మీ, మద్యానికి బానిసై డబ్బుల సంపాదన కోసం చోరీల బాట పట్టాడు. బంగారం దుకాణంలోకి కస్టమర్ లాగా ప్రవేశించి పలు చైన్లను చూపించమని సేల్స్ పర్సన్ కు చెప్పి, వారు తమ పనిలో నిమగ్నం అయ్యి ఉండగా అదను చూసుకొని చైన్ చోరీ చేస్తాడు.

 

ఈ విధంగా కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండు దుకాణాలు, పంజాగుట్ట, మహంకాళి, నిర్మల్, మిర్యాలగూడ, మక్తల్, చైతన్యపురి స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడ్డాడు. కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్ పరిధిలోని లలిత జ్యువలరీ షో రూం లో ఈ నెల 3వ తేదీన చోరికి పాల్పడగా, ఫిర్యాదు అందటంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు, సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. ఈ రోజు కె.పి.హెచ్.బి కాలనీలో అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండగా, పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. నిందితుడి నుండి 151.83 గ్రాముల బంగారు అభరణాలు స్వాధీనం చేసుకున్నామని ఏసిపి తెలిపారు .

 

Exit mobile version