NTV Telugu Site icon

Lucknow firing: ఇరువర్గాల ఘర్షణ.. తుపాకీతో కాల్పులు

Dke

Dke

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో చిన్నపాటి డ్యాషింగ్.. ఇరువర్గాల మధ్య ఘర్షణ కాల్పులకు దారి తీసింది. ఇరువైపులా పెద్ద ఎత్తున రాళ్లు రువ్వుకున్నారు. అనంతరం ఒక వ్యక్తి తుఫాకీతో కాల్పులకు తెగబడ్డాడు. లక్నోలోని ఈశ్వరీ ఖేరా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: Taneti Vanitha: డీజీపీకి హోంమంత్రి తానేటి వనిత ఫోన్.. టీడీపీ హింసాకాండ మీద చర్యలకు డిమాండ్

ఐదేళ్ల సోదరుడిని స్కూల్ దగ్గర రిసీవ్ చేసుకుని.. ఇద్దరూ ఇంటికి తిరిగి వెళ్తుండగా.. దారిలో వారి స్కూటర్‌ను ఒక కారు ఢీకొట్టింది. అనంతరం కారు యజమాని హర్ష్ ఉపాధ్యాయ్, అతని స్నేహితులు ఇద్దరు సోదరులను కొట్టారు. సోదరులిద్దరూ కుటుంబ సభ్యులకు తెలియజేయగా.. పెద్ద గుంపుగా వచ్చి కారు యజమాని కుటుంబ సభ్యులపై రాళ్లతో దాడులకు తెగబడ్డారు. దాదాపు ఇరువర్గాల నుంచి 40-50 మంది పాల్గొన్నారు. చిన్నగా మొదలైన గొడవ ఇరువైపులా రాళ్లు రువ్వుకున్నారు. సూట్‌లో ఉన్న ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులకు తెరలేపాడు. నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. హింసాత్మక ఘటనలో రెండు కార్లు దెబ్బతిన్నాయని, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మంగళవారం లక్నోలోని ఈశ్వరీ ఖేరా ప్రాంతంలో జరిగింది.

ఇది కూడా చదవండి: Kangana Ranaut: బాలీవుడ్ నటి, బీజేపీ అభ్యర్థి కంగనా ఆస్తులు ఇవే!

ఈ ఘర్షణపై అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు. తుపాకీతో కాల్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ ప్రాంతంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని, పరిస్థితి అదుపులో ఉందని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Varanasi: మోడీపై నామినేషన్ వేయనివ్వలేదన్న కమెడియన్ శ్యామ్ రంగీలా