తీర్థయాత్రల కోసమని బయల్దేరిన పండితులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. దేవుడిని దర్శించుకుంటే పుణ్యం కలుగుతుందని భావించినా వారు.. డైరెక్టుగా దేవుడి దగ్గరికే వెళ్లారు. ఈ ఘటన తీవ్ర విషాదం నింపింది. రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు పండితులు మరణించారు.
Read Also: YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి చేరికలు..
వివరాల్లోకి వెళ్తే.. నందిగామ మండల పరిధిలోని ఎంఎస్ఎన్ కంపెనీ వద్ద గల బైపాస్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మైసూర్ నుండి వారణాసికి వెళ్తుండగా కారు బోల్తాకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం ఆరుగురు పండితులు ఉన్నారు. ఎంఎస్ఎన్ కంపెనీ సమీపాన రాగానే ప్రమాదవశాత్తు కారు చెట్టుకు ఢీకొని బోల్తా పడి ప్రమాదం జరిగింది. షాద్ నగర్ వైపు నుండి హైదరాబాద్ వైపు వెళుతుండగా కారు ప్రమాదానికి గురైంది. అయితే ఈ ఘటనలో ఇద్దరు పండితులు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన నలుగురిని చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Read Also: Tamilisai: తెలంగాణ ప్రజలను వదిలి వెళ్తునందుకు బాధగా ఉంది.. ఎప్పటికీ మరువను