NTV Telugu Site icon

Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు హైదరాబాదీలు మృతి

Up Road Accident

Up Road Accident

Road Accident: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో.. ఐదుగురు తెలంగాణవాసులు ప్రాణాలు విడిచారు.. నంద్యాలలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌లోని అల్వాల్ కు చెందిన ఓ కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు మృతిచెందారు.. రాజకీయ నాయకుడు రవీందర్ రెడ్డి ఫ్యామిలీ మెంబర్స్‌గా గుర్తించారు నంద్యాల పోలీసులు. మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.. లారీని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద నేషనల్ హైవే పై ఘటన జరిగింది.. తిరుపతి వెళ్లిన ఆ కుటుంబం.. తిరుపతి నుంచి తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.. తిరుమల వెంకన్నను దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం అయిన సమయంలో.. ఒకే కుటుంబంలోని ఐదుగురు మృత్యువాతపడ్డారు.. మృతులు మంత్రి రవీందర్(50), ఆయన భార్య లక్ష్మీ(45), కుమారుడు సాయి కిరణ్(28), ఉదయ్ కిరణ్(30), కోడలు కావ్యశ్రీ(24)గా గుర్తించారు. కారు అతివేగంగా దూసుకెళ్తగా.. లారీ హైవేలో నిలిపి ఉండడం.. దానికి కనీసం ఇండికేటర్ కూడా వేయకపోవడం ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also: Sundaram Master OTT: రెండు ఓటీటీల్లో రాబోతున్న సుందరం మాస్టర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?