Sundaram Master OTT: రెండు ఓటీటీల్లో రాబోతున్న సుందరం మాస్టర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూట్యూబ్ లో షార్ట్ వీడియోలు చేస్తూ చాలా మంది బాగా పాపులర్ అయ్యారు.. ఆ తర్వాత సినిమాల్లో కూడా ఛాన్స్ లు అందుకున్న వాళ్లు చాలా మందే ఉన్నారు.. అందులో వైవా హర్ష కూడా ఒకరు.. వచ్చిన అవకాశం ను వాడుకుంటూ ఎమోషనల్ సీన్స్ కూడా బాగా చేశారు. కంటతడి పెట్టించారు. ఇప్పుడు ‘సుందరం మాస్టర్’ సినిమాతో వైవా హర్ష హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆర్.టీ. టీం వర్క్స్, గోల్ డెన్ మీడియా పతాకాలపై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మించిన చిత్రమిది. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించారు. ఇందులో దివ్య శ్రీపాద హీరోయిన్ గా నటించింది..
ఈ సినిమా పాజిటివ్ టాక్ దూసుకుపోయింది.. అంతేకాదు కలెక్షన్స్ కూడా అలానే వచ్చాయి.. సినిమా టీజర్, ట్రైలర్స్ రిలీజ్ చేసినప్పటి నుంచి సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచానికి సంబంధం లేని ఓ ఊరికి ఇంగ్లీష్ మాస్టర్ గా వెళ్లి సుందరం మాస్టర్ పడ్డ కష్టాలు, నేర్చుకున్న జీవిత పాఠాలతో ఈ సినిమా సాగుతుంది. హీరోగా మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ కొట్టాడు వైవా హర్ష..ఈ సినిమా టాక్ తో పాటు కలెక్షన్స్ కూడా బాగానే ఉన్నాయి.. ఓ చిన్న సినిమా, కమెడియన్ హీరోగా మారి చేసిన సినిమా మొదటి రోజే ఈ రేంజ్ లో కలెక్షన్స్ సాధించడం అంటే విశేషమే. మొత్తానికి సుందరం మాస్టర్ సక్సెస్ కొట్టాడు.
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
ఇక ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ రావడానికి రెడీ అవుతుంది..ఏకంగా రెండు ఓటీటీల్లోనూ వైవా హర్ష అందుబాటులోకి రానుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఆహాతో పాటు ఈటీవీ విన్ లో ఈ లేటెస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ స్ట్రీమింగ్ కానుంది.. అయితే ఈనెల 21 నుంచి లేదా 22 నుంచి స్ట్రీమింగ్ కాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే అధికారక ప్రకటన మాత్రం రాలేదు.. త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నట్లు సమాచారం..
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!