NTV Telugu Site icon

RK Selvamani: నగరిలో ఇంటిపోరు..! మంత్రి రోజా వ్యతిరేకవర్గానికి సెల్వమణి కౌంటర్..

Rk Selvamani

Rk Selvamani

RK Selvamani: మంత్రి ఆర్కే రోజా ప్రతినిథ్యం వహిస్తోన్న నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో వర్గపోరు పలు సందర్భాల్లో బహిర్గతం అయ్యింది.. దీనిపై మంత్రి ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.. అయితే, మంత్రి రోజా వ్యతిరేక వర్గానికి ఆమె ఆర్కే సెల్వమణి కౌంటర్ ఇచ్చారు.. నమ్మిన వారికి ఏ రోజు మేం ద్రోహం చేయలేదన్న ఆయన.. నిండ్ర చక్రపాణి రెడ్డికి శ్రీశైలం బోర్డు చైర్మన్ ఇవ్వాలని రోజా.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని కోరారు.. మావల్లే ఆయనకు పదవి వచ్చిందన్నారు. ఇక, జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డికి స్థానికులు వద్దు అని చెప్పినా పదవి ఇచ్చామని గుర్తుచేసుకున్నారు.. కేజీ కూమార్ కుటుంబానికి ఎంతో సహాయం చేశామన్నారు.

Read Also: Srikalahasti temple: శ్రీకాళహస్తి ఆలయంలో డ్రోన్ కలకలం…

అయితే, ఇప్పుడు వారు మామీదే తప్పుగా మాట్లాడుతూన్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు సెల్వమణి.. అది అతని తప్పు కాదు.. అతని వెనకాల ఉన్నవారు అలా మాట్లాడిస్తున్నారని దుయ్యబట్టారు. మనల్ని విమర్శించారని వారిని మనం విమర్శించాల్సిన అవసరం లేదు.. దేవుడనే వాడు ఒకడు ఉంటాడు.. ప్రతి ఒక్కటి చూస్తుంటాడని పేర్కొన్నారు. రోజా.. ఎమ్మెల్యేగా గెలవదు అన్నారు, మంత్రి పదవి రాదన్నారు.. కానీ, అవి జరిగాయన్నారు.. అంతేకాదు.. ఈ సారి 175 స్థానాల్లో వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుస్తుంది.. అందులో ఫస్ట్ గెలుచేది నగరి నియోజకవర్గమేనని స్పష్టం చేశారు.. గెలిచిన తర్వాత మమ్మల్ని వ్యతిరేకించేవారితో మాట్లాడుతాం అంటున్న ఆర్కే సెల్వమణి.. ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేశారు తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..