కూటమి ప్రభుత్వం అధికర్మలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా.. ఇచ్చిన హామీలను అమలు చేయాకుండా రెడ్ బుక్ రాజ్యాన్ని నడుపుతున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక్క రోడ్డు అయినా కూటమి ప్రభుత్వం వేసిందా? అని ప్రశ్నించారు. కూటమి నేతలు సూపర్ సిక్స్ పక్కనపెట్టి.. సూపర్ స్కామ్‌లు చేస్తున్నారని విమర్శించారు. కూటమి నేతలు రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి, ఇసుక మాఫియాతో రెచ్చిపొతున్నారన్నారు. చంద్రబాబు వచ్చాక టీడీపీ నేతలకు పదవులు వచ్చాయని, ప్రజల చేతికి మాత్రం చిప్ప ఇచ్చారని రోజా ఎద్దేవా చేశారు.
మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపు మేరకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ నేతలు ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమాన్నిపెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నగరిలో నిర్వహించిన వెన్నుపోటు దినంలో ఆర్కే రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ‘సంవత్సరం అవుతున్నా ఇచ్చిన హామీలను అమలు చేయాకుండా రెడ్ బుక్ రాజ్యాన్ని నడుపుతున్నారు. రాష్ట్రంలో ఒక్క రోడ్డు అయినా కూటమి ప్రభుత్వం వేసిందా?. సూపర్ సిక్స్ పక్కనపెట్టి సూపర్ స్కామ్‌లు చేస్తున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి, ఇసుక మాఫియాతో కూటమి నేతలు రెచ్చిపొతున్నారు. వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేదిస్తున్నారు. మా నేతలపై కేసులు పెట్టిన వారిని వదిలిపెట్టము. ఫ్యాకేజ్ ఇస్తే పిఠాపురంలో యువతిపై రేప్ జరిగినా పవన్ కల్యాణ్ గారికి అవసరం లేదు. ప్రజలను ఎదురుగా నిలుచుని చంద్రబాబు వెన్నుపోటు పోడిస్తే.. సైడ్ నుండి వెన్నుపోటు పొడిచిన కన్నింగ్ కట్టప్పలు లోకేష్, పవన్. ప్రజలను కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది’ అని మండిపడ్డారు.
Also Read: Ramachandra Reddy: నీ కొడుకును రాజీనామా చేయమని చెబుతారా?.. సీఎంకు సవాల్ విసిరిన పెద్దిరెడ్డి!
‘ఎన్నికల ముందు టీడీపీ నేతలు వచ్చేది బాబే, జాబు ఇచ్చేది బాబే అన్నారు. చంద్రబాబు వచ్చాక టీడీపీ నేతలకు పదవులు వచ్చాయి, ప్రజల చేతికి మాత్రం చిప్ప ఇచ్చారు. సూపర్ సిక్స్ ఒక్క హామీ అమలు చేయలేదు. కూటమి నేతలు ఈవీఎంలను మ్యానెజ్ చేసి యాబై, అరవై వేల మెజారిటీ తెచ్చుకున్నారు. అందరూ గాల్లో గెలిచిపోయిన గాలి గాళ్లే రాష్ట్రం మొత్తం ఉన్నారు. చంద్రబాబు అంటే వెన్నుపోటు, వెన్నుపోటు అంటే చంద్రబాబు. రాష్ట్రంలో ఉన్న అప్పులు మొత్తం తీర్చి ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్ గారిది. విద్యా వ్యవస్థను నాశనం చేశారు. రైతుల ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు’ అని ఆర్కే రోజా చెప్పుకొచ్చారు.
