Site icon NTV Telugu

RK Roja: మహానాడులో తీర్మానం చేసే దమ్ము టీడీపీకి నేతలకు ఉందా?.. ఆర్కే రోజా కీలక వ్యాఖ్యలు!

Minister Rk Roja

Minister Rk Roja

కూటమి ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులకు భయపడే వాళ్లు ఇక్కడ ఎవరూ లేరని మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే కాకాణి గోవర్ధన్‌ రెడ్డిని అరెస్టు చేశారన్నారు. రోజుకొకరిపై అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పెట్టుకుందని విమర్శించారు. రాబోయే రోజుల్లో కూటమి నేతలు చేసిన పనులకు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. వైఎస్ జగన్ మళ్లీ సీఎం అయ్యాక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి.. అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎలా ఉంటుందో చూపిస్తామని రోజా చెప్పుకొచ్చారు.

Also Read: HPSL 2025: ఐపీఎల్ తరహాలో లీగ్.. 8 గుర్రాలు మృతి!

తిరుపతిలో మాజీ మంత్రి ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ… ‘ఇచ్చిన హామీలను అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే కాకాణి గోవర్ధన్‌ రెడ్డిని అరెస్టు చేశారు. రోజుకొకరిపై అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పెట్టుకుంది. ఏడాదిలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని మహానాడులో తీర్మానం చేసే దమ్ము టీడీపీకి నేతలకు ఉందా?. ఏ హామీలు అమలు చేశారని మహానాడు నిర్వహిస్తున్నారో టీడీపీ నేతలు సమాధానం చెప్పాలి. పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, కాకాణిపై కేసులు అక్రమంగా పెట్టారు. అక్రమ కేసులకు భయపడే వారు ఇక్కడ ఎవరూ లేరు. రాబోయే రోజుల్లో కూటమి నేతలు చేసిన పనులకు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. జగన్ మళ్లీ సీఎం అయ్యాక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎలా ఉంటుందో చూపిస్తాం. లిక్కర్ స్కామ్ అనేది ఒక పెద్ద అబద్ధం. స్కామ్ జరగలేదు, టీడీపీ మాత్రం స్కామ్ జరిగిందంటూ కేసులు పెట్టి వేధిస్తోంది. ఇచ్చిన హామీలను అమలు చేయలేక లిక్కర్, ఇతర స్కామ్ అంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు‌’ అని మండిపడ్డారు.

Exit mobile version