వైసీపీ హయంలో జరిగిన ప్రమాదాలను వివరిస్తూ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తన కార్యాలయంలో ఫ్లెక్సీ వేశారు. ‘రాబందుల ముఠా.. ఇదిగో జగనాసుర రక్తచరిత్ర’ అంటూ ప్రమాద ఘటనలకు సంబంధించిన వివరాలను వివరించారు. ప్రభాకర్ రెడ్డి నేడు మీడియాతో మాట్లాడుతూ తిరుమల తొక్కిసలాటపై వైసీపీ శవ రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. తిరుమల టికెట్ల టోకెన్లు అమ్ముకుని మాజీ మంత్రి ఆర్కే రోజా బెంజ్ కారు తెచ్చుకుందని విమర్శించారు. నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడవద్దని రోజాను జేసీ హెచ్చరించారు.
‘వైసీపీ నేతలు శవ రాజకీయాలు చేయడానికి బయలు దేరారు. ఆనం గురించి మాట్లాడే అర్హత రోజాకు లేదు. ఆనం గురించి ఏమి తెలుసు అని మాట్లాడుతున్నావు. రోజా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. వైసీపీ నేతలను బయటకు రాకుండా చేయాలి. తిరుమల టోకెన్లు అమ్ముకుని రోజా బెంజ్ కారు తెచ్చుకుంది. దర్శనానికి వెళ్లిన ప్రతిసారి వందలాది మందిని వెంట తీసుకెళ్లేది. టోకెన్ల దందాప్తె రోజాప్తె విచారణ జరపాలి. చెక్ బౌన్స్ కేసులు రోజాపై ఉన్నాయి. చంద్రబాబు నాయుడు పుణ్యాన రోజా రాజకీయాల్లోకి వచ్చింది. నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడొద్దు’ అని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు.
‘మేం వైసీపీ ప్రభుత్వంలో అనేక కష్టాలు పడ్డాం. తాడిపత్రిలోనే కార్యకర్తలప్తె 890 కేసులు ఉన్నాయి. యువగళం ప్రారంభంలో ఎన్ని ఇబ్బందులు పెట్టారు. సీఎం చంద్రబాబు అభివృద్ధి చేస్తారని ప్రజలందరికీ తెలుసు. మీ మంచితనం అందరికీ తెలుసు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా చంద్రబాబు మాత్రం వారిని వదిలేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఫేడ్ అవుట్ అవుతున్నారు. ఆయనకు వైసీపీలోనే శత్రువులు ఉన్నారు. తిరుమల తొక్కిసలాటపై వైసీపీ శవ రాజకీయాలు చేస్తోంది. తిరుపతి ఘటనలో పూర్తిస్థాయి విచారణ చేస్తే అన్ని విషయాలు తెలుస్తాయి’ అని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.