నగరిలో టీడీపీ ఎమ్మెల్యే చేసింది శూన్యం అని మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. కల్యాణమండపం, సబ్ స్టేషన్, పాలిటెక్నిక్ కాలేజీ, పార్కు, షాదీ మహల్ అన్నీ తామే కట్టామన్నారు. పేదవారికి ఇళ్లతో సహా వైసీపీనే ఇచ్చిందన్నారు. చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి సీఎం చంద్రబాబు టెక్స్‌టైల్ పార్క్ పెడతామంటున్నారని ఎద్దేవా చేశారు. సీఎం అబద్ధాలు వినలేక నగరిప్రజలు పారిపోయారన్నారు. నగరి నియోజకవర్గానికి ఉపయోగపడేది ఒక్కటీ లేదని రోజా విమర్శించారు. స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు నగరిలో సీఎం చంద్రబాబు పర్యటించారు.
Also Read: Chiranjeevi-Mega 158: ‘మెగా 158’ టైటిల్ వైరల్.. ఇదే ఫైనలా?
‘నగరిలో సీఎం చంద్రబాబు డబ్బా కొట్టుకోవడం తప్ప.. ఒక్క రూపాయి నియోజకవర్గానికి ఇవ్వరు. స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కాదు.. అప్పుల అంధ్ర, అరాచక ఆంధ్రగా మార్చేశారు. చంద్రబాబు నాలుగు సార్లు సీఎంగా ఉండి నగరికి ఎప్పుడూ ఎమీ చేయలేదు. గాలి ముద్దుకృష్ణమ నాయుడు నగరికి చేసింది శూన్యం. వైసీపీ హాయంలో కొన్ని వందల కోట్లతో నగరిలో రోడ్లు, కాలువలు ఇతర అభివృద్ధి పనుల చేసి చూపించాం. పవర్ లూమ్ కార్మికులు వైఎస్ జగన్ చేసినంతగా సహాయం ఎవరు చేయలేదు. టెక్స్‌టైల్ పార్క్ కట్టిస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశారు. పవర్ లూల్ కార్మికులకు ఉచిత కరెంట్ అని జీవో ఇచ్చి మోసం చేశారు. నగరి ఆసుపత్రిలో పర్యటన అని.. మళ్ళీ అది జగన్ కట్టిందని అక్కడికి పోలేదు. ఏ అభివృద్ధి చేయని ఎమ్మెల్యే భాను ప్రకాష్ ను కూడా బాగా పని చేశాడని చంద్రబాబు పొగిడారు. చెరుకు రైతులను, మామిడి రైతులను చంద్రబాబు సర్వనాశనం చేశారు’ అని మాజీ మంత్రి ఆర్కే రోజా ఫైర్ అయ్యారు.
