Site icon NTV Telugu

Bihar Elections 2025: పాపం..! టికెట్ రాకపోవడంతో కుర్తా చించుకుని.. రోడ్డుపై పడి ఏడ్చిన ఆర్జేడీ నేత..

Bihra

Bihra

Bihar Elections 2025: బీహార్‌ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై ఆర్‌జేడీ–కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్‌లో అస్పష్టత నెలకొన్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా రాజకీయ గందరగోళం మధ్య, పాట్నాలో నాటకీయ దృశ్యం ఆకట్టుకుంది. మధుబన్ అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ ఆశించిన మదన్ షా వింత చేష్టలతో వార్తల్లో నిలిచారు. సర్క్యులర్ రోడ్‌లోని 10వ నంబర్‌లోని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ నివాసం వెలుపల గందరగోళం సృష్టించారు. మదన్ షా లాలు నివాసం గేటు బయట తన కుర్తాను చింపి, నేలపై పడుకుని, బిగ్గరగా ఏడ్చారు. సంఘటన స్థలంలో ఉన్న వ్యక్తులు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో రికార్డు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

READ MORE: Mitchell Starc: రోహిత్‌కు స్టార్క్‌ బౌలింగ్.. 176.5 కిమీ స్పీడ్ ఏంటి సామీ?

ఆ వీడియోలో ఆర్జేడీ ప్రముఖ నాయకులు టికెట్ కోసం తనను రూ. 2.70 కోట్లు అడిగారని మదన్ షా చెబుతున్నారు. తాను డబ్బు ఇవ్వకపోవడంతో పార్టీ తన టికెట్‌ను రద్దు చేసి, బదులుగా డాక్టర్ సంతోష్ కుష్వాహాకు ఇచ్చిందని ఆరోపించారు. నేను పార్టీ కోసం చాలా సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తున్నాను. కానీ టిక్కెట్లు డబ్బు ఆధారంగా పంపిణీ చేశారు. అంకితభావంతో పనిచేసే కార్యకర్తలను విస్మరిస్తూ, డబ్బు ఉన్నవారికి పార్టీ ప్రాధాన్యత ఇచ్చిందని మదన్ షా అన్నారు. ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ సంజయ్ యాదవ్ పై కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. యాదవ్ టిక్కెట్లను బ్రోకర్ లా అమ్ముకున్నారని ఆరోపించారు. ఈ సంఘటన లాలూ-రబ్రీ నివాసం వెలుపల గందరగోళాన్ని సృష్టించింది. భద్రతా సిబ్బంది వెంటనే మదన్ షాను సంఘటన స్థలం నుంచి పంపించారు. ఈ ఘటనపై ఆర్జేడీ ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

READ MORE: Shocking News: కొండపై నుంచి దూకి బాలికల ఆత్మహత్యాయత్నం..

Exit mobile version