River Foam: ప్రస్తుత ప్రపంచంలో ఏదో విషయం సంబంధించి వింతలు, విశేషాలు జరుగుతూ ఉండడం మనం చూస్తూనే ఉంటాము. ఈ నేపథ్యంలో కొన్ని ఘటనలు సంతోషాన్ని కలగజేస్తే.. మరికొన్ని భయభ్రాంతులకు కలుగజేసేలా ఉంటాయి. ఇలాంటి సంఘటనకు సంబంధించిన అనేక విషయాలు మీడియా ద్వారా ప్రతిరోజు తెలుసుకుంటున్నాము. తాజాగా ఇలాంటి అబ్బురపరిచే సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చుస్తే..
Read Also: IND vs NZ 2nd Test: నాలుగో ఇన్నింగ్స్ ఆడలేం.. 200 ప్లస్ లీడ్ ఉంటేనే గెలుపై అవకాశాలు!
కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ పినాకిని నది సమీపంలో పెద్ద ఎత్తున నురుగు చేరి అచ్చం మేఘాన్ని తలపించేలా అక్కడి పరిసర ప్రాంతాలను కమ్మేసింది. దక్షిణ పినాకిని నదిపై హోసూరు సమీపంలో నిర్మించన జలాశయం నుండి పెద్ద ఎత్తున నురగ వచ్చి ఏకంగా పక్కనే ఉన్న రోడ్లపైకి పెద్ద ఎత్తున చేరడంతో అక్కడ రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. అయితే ఈ ఘటనను చూసిన స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ముఖ్యంగా బెంగుళూరు నగరంలోని పరిశ్రమల వల్ల అనేక వ్యర్ధాలు జలాశయంలోకి చేరడం ద్వారానే ఇలాంటి పరిస్థితి వస్తోంది అంటూ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంపై పోలీసులు పరిస్థితిని గమనించి అసలు విషయాన్ని కనుగొనేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఏదైనా మేఘం రోడ్డుపై పడిపోయిందా అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.
Read Also: NIA: పట్టు బిగించిన ఎన్ఐఏ.. లారెన్స్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌పై భారీ రివార్డు ప్రకటన