టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. మిగతా బ్యాటర్లు తడబడిన వేళ నాగ్‌పూర్ పిచ్‌పై శతకం బాది అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అతడి భార్య రితికా సజ్దే కూడా రోహిత్‌ను కొనియాడింది. “లవ్ యూ రోహిత్” అంటూ ప్రేమను కురిపించింది. కాగా రితిక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తన వ్యక్తిగత అంశాలకు సంబంధించిన అప్‌డేట్లు పంచుకోవడంతో పాటు ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో తన ఇన్‌స్టా స్టోరీలో రోహిత్ శర్మ ఫోటో షేర్ చేసిన రితిక.. ఫింగర్స్ క్రాస్డ్ ఎమోజీని జత చేసింది. వీటికి రీప్లేస్‌మెంట్ పంపించు అంటూ ఫన్నీగా కామెంట్ చేసింది. ఈ పోస్ట్ నెటిజన్లను ఆకర్షిస్తోంది.
కాగా రోహిత్ బ్యాటింగ్ చేస్తున్న ప్రతిసారి రితిక ఫింగర్స్ క్రాస్ చేసి.. తమకు అనుకూల ఫలితం రావాలంటూ ప్రార్థించిన దృశ్యాలు గతంలో వైరల్ అయ్యాయి. ఇక తన మేనేజర్‌గా పనిచేసిన రితికతో ప్రేమలో పడ్డ రోహిత్ 2015లో ఆమెను పెళ్లాడాడు. వారికి కూతురు సమైరా శర్మ సంతానం. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 212 బంతులు ఎదుర్కొన్న హిట్‌మ్యాన్.. 15 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 120 పరుగులు చేశాడు. టెస్టు కెప్టెన్‌గా రోహిత్‌కు ఇది తొలి శతకం. అదే విధంగా ఈ ఇన్నింగ్స్ ద్వారా రోహిత్ మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన తొలి భారత కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు.
Also Read: INDvsAUS 1st Test: మర్ఫీకి 7 వికెట్లు.. 141 ఏళ్ల రికార్డు బద్దలు