బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా స్పిన్నర్ టాడ్ మర్ఫీ అదరగొట్టాడు. కీలక భారత ప్లేయర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ 7 వికెట్లతో రెచ్చిపోయాడు. సహచర సీనియర్ స్పిన్నర్ నాథన్ లియోన్ తడబడిన వేళ.. అరంగేట్ర టెస్టులోనే ఔట్ ఆఫ్ ది బాక్స్‌గా వచ్చి రికార్డులు సృష్టించాడు. రెండో రోజు ఆట సందర్భంగా తన తొలి ఐదు వికెట్లు హాల్ సాధించిన మర్ఫీ.. మూడో రోజు ఆటలో మరో రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో డెబ్యూ టెస్టులోనే ఐదు వికెట్ల ఘనత సాధించిన 22 ఏళ్ల మర్ఫీ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో ఐదు వికెట్ల హాల్ సాధించిన అతి పిన్న వయస్కుడైన ఆస్ట్రేలియా స్పిన్నర్‌గా మర్ఫీ రికార్డులకెక్కాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ జోయ్ ప్లామర్ పేరిట ఉండేది.
Also Read: INDvsAUs 1st Test: భారత్ 400 ఆలౌట్..కంగారూలపై 223 రన్స్ లీడ్
ప్లామర్ 1882లో ఇంగ్లాండ్‌తో జరగిన ఓ టెస్టు మ్యాచ్‌లో 22 ఏళ్ల 360 రోజుల్లో ఐదు వికెట్ల ఘనతను సాధించాడు. ఇక 22 ఏళ్ల 87 రోజుల వయసులోనే ఈ ఘనతను సాధించిన మర్ఫీ.. 141 ఏళ్ల ప్లామర్ రికార్డును బ్రేక్ చేశాడు. అదే విధంగా మరో రికార్డును మర్ఫీ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియా తరపున అరంగేట్ర టెస్టులోనే ఐదు వికెట్లతో చెలరేగిన నాలుగో ఆఫ్‌స్పిన్నర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో స్కాట్ బొలాండ్, జోష్ హేజిల్‌వుడ్, పాట్ కమిన్స్, నాథన్ లియోన్ ఉన్నారు.
Also Read: Tejashwi Yadav: మీకేమో ప్రేమ పెళ్లి.. నా పెళ్లికి నిరుద్యోగం అడ్డంకి.. యువతి లవ్ లెటర్ వైరల్