Rishikanta Singh Chanambam: రోజుకు రూ.200 కూలీ నుంచి కామన్వెల్త్ గేమ్స్ రజత పతకం వరకు.. రిషికాంత సింగ్ ప్రయాణం ఇలా.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishikanta Singh Chanambam: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత వెయిట్‌లిఫ్టర్ “రిషికాంత సింగ్ చానబం” దేశానికి రజత పతకాన్ని అందించాడు. పురుషుల 60 కేజీల విభాగంలో మొత్తం 264 కేజీలు (121 కేజీల స్నాచ్, 143 కేజీల క్లీన్ అండ్ జర్క్) ఎత్తి రెండో స్థానంలో నిలిచాడు. చివరి ప్రయత్నంలో 151 కేజీలు ఎత్తడంలో విజయం సాధించి ఉంటే స్వర్ణ పతకం అతని ఖాతాలో చేరేది.
ఈ రజత పతకం వెనుక ఓ క్రీడాకారుడి విజయం మాత్రమే కాదు.. ఎన్నో కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, జీవితంతో చేసిన పోరాటం దాగి ఉంది. ఒక దశలో వెయిట్లిఫ్టింగ్కు పూర్తిగా దూరమై, కుటుంబాన్ని ఆదుకోవడానికి నిర్మాణ పనుల్లో రోజువారీ కూలీగా పనిచేసిన రిషికాంత.. ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై భారత్‌కు పతకం అందించాడు.
Also Read
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
తన జీవితంలో ఎన్నో కష్టమైన రోజులను గుర్తు చేసుకుంటూ రిషికాంత భావోద్వేగానికి గురయ్యాడు. వెయిట్‌లిఫ్టింగ్‌లో తన భవిష్యత్తు ముగిసిపోయిందని భావించి, ఈ క్రీడకు చెందిన స్నేహితులతో కూడా సంబంధాలు తెంచుకున్నానని అన్నారు. జీవనోపాధి కోసం ఏ పని దొరికితే ఆ పని చేస్తూ, మరుసటి రోజు ఎక్కడ పని దొరుకుతుందో అనే ఆలోచనతోనే రోజులు గడిపానని తెలిపాడు.
రిషికాంత ఇప్పటికే 2016లో జాతీయ యూత్ టైటిల్‌ను గెలుచుకోగా.. 2017 జూనియర్ కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించాడు. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉండటంతో వెయిట్‌లిఫ్టింగ్‌ను కొనసాగించడం సాధ్యపడలేదు. రోజుకు కేవలం రూ.150 నుంచి రూ.200 మాత్రమే సంపాదించేవాడినని, ఆ డబ్బుతో.. పాలు, గుడ్లు వంటి పోషకాహారం కొనడం కూడా కష్టంగా ఉండేదని తెలిపాడు. కొన్నిసార్లు ఇంట్లో ఏది ఉంటే అదే తినాల్సి వచ్చేదని, మరికొన్ని సందర్భాల్లో అల్పాహారం లేదా రాత్రి భోజనం కూడా మానేయాల్సి వచ్చేదని గుర్తు చేసుకున్నాడు.
అయితే అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది టక్యెల్ లోని వెయిట్‌లిఫ్టింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. అక్కడ శిక్షణ పొందే అవకాశం రావడంతో మళ్లీ వెయిట్ లిఫ్టింగ్‌పై దృష్టి సారించాడు. కఠోర శ్రమతో ఏడాది వ్యవధిలోనే తన తొలి సీనియర్ జాతీయ టైటిల్‌ను కైవసం చేసుకుని తిరిగి తన సత్తా చాటాడు. అతని కృషికి మరో నిదర్శనంగా 2025లో అహ్మదాబాద్‌లో జరిగిన కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల 60 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. అదే ఆత్మవిశ్వాసంతో కామన్వెల్త్ గేమ్స్ లోనూ రజత పతకాన్ని గెలుచుకుని మరోసారి తన ప్రతిభను చాటాడు.
స్వర్ణ పతకం చేజారినప్పటికీ తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ రిషికాంత కృతజ్ఞతలు తెలిపాడు. ముఖ్యంగా భారత ప్రధాన కోచ్ విజయ్ శర్మ తనకు పోటీల్లో ఎలా ఆడాలి.? ఎలా శిక్షణ పొందాలి.? అనే విషయంలో ఎంతో మార్గనిర్దేశనం చేశారని కొనియాడాడు. అలాగే భారత క్రీడలకు విశేష ప్రోత్సాహం అందిస్తున్నందుకు ఈ విజయాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Lakshmi Narayana Yoga: తులారాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
-
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!