Site icon NTV Telugu

Rishi Sunak : ఫస్ట్ డేనే పార్లమెంట్‎‎లో రిషి సునాక్‎కు షాక్

Rishi Sunak

Rishi Sunak

Rishi Sunak : భారత సంతతికి చెందిన రిషి సునాక్ ప్రధాని హోదాలో తొలిసారి పార్లమెంట్లో అడుగుపెట్టిన రోజు ఆయనకు విపక్షాల నుంచి ఊహించని షాక్ ఎదురైంది. సుయెల్లా బ్రేవర్మన్‌ను హోం మంత్రిగా నియమించడాన్ని ప్రతిపక్ష లేబర్ పార్టీ విమర్శించింది. నిబంధనలు ఉల్లంఘన ఆరోపణ నేపథ్యంలో ఆమె హోంమంత్రి పదవికి గతవారమే రాజీనామా చేశారు. మళ్లీ ఆమెను కేబినెట్లోకి తీసుకోవడాన్ని ప్రతిపక్షాలు నిలదీశాయి. దీంతో సునాక్‌, బ్రేవర్మన్‌ మధ్య కుట్రపూరిత ఒప్పందం జరిగిందంటూ ఆరోపణలు గుప్పించాయి.

Read Also: Money Prasad in Temple : దేవుడి ప్రసాదంగా డబ్బులు పంచుతున్నరు.. భక్తులారా త్వరపడండి

అయితే, ఈ ఆరోపణలను సునాక్ గట్టిగా సమర్థించుకున్నారు. మొదటి క్యాబినెట్ సమావేశం ఏర్పాటుచేసిన సునాక్‌.. అనంతరం హౌజ్‌ ఆఫ్‌ కామన్స్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్రేవర్మన్ నియామకంపై ప్రధానిని ప్రతిపక్ష లేబర్ పార్టీ నేత కీర్‌ స్టార్మర్‌ ప్రశ్నించారు. దీనికి సునాక్‌ స్పందిస్తూ- ‘‘ఆమె చేసిన పొరపాటును గుర్తించి పదవి నుంచి తప్పుకొన్నారు.. కాబట్టి ఆమెను తిరిగి ఉమ్మడి మంత్రివర్గంలోకి నేను సంతోషంగా స్వాగతించాను. ఫలితంగా మంత్రివర్గానికి స్థిరత్వం చేకూరింది’’ అని ఉద్ఘాటించారు. నేరస్థులపై కొరడా ఝళిపించడం, సరిహద్దులను పరిరక్షించడంపై ఆమె దృష్టిసారిస్తారని ధీమాగా చెప్పారు. అంతకుముందు, లేబర్‌ పార్టీకి చెందిన బ్రిడ్జెట్‌ ఫిలిప్సన్‌ కూడా బ్రేవర్మన్‌ నియామకాన్ని తప్పుపట్టారు.

Read Also:EC Shocking Decision: ఎన్నికల వేళ ఈసీ షాకింగ్ డెసిషన్.. ఏకంగా 900మంది బదిలీ

మరో ప్రతిపక్ష పార్టీ లిబరల్‌ డెమొక్రాట్లు కూడా ఇదే తరహా ఆరోపణలు గుప్పించింది. బ్రేవర్మన్‌ నియామకంపై క్యాబినెట్‌ కార్యాలయం స్వతంత్ర దర్యాప్తు నిర్వహించాలని డిమాండ్‌ చేసింది. విపక్షాల ఆరోపణలను బ్రిటన్‌ విదేశాంగ మంత్రి జేమ్స్‌ క్లెవెర్లీ తిప్పికొట్టారు. ప్రధాని రేసులో మిగతావారితో పోలిస్తే సునాక్ చాలా ముందంజలో ఉండి పదవిని దక్కించుకున్నారని.. ఒకరిద్దరు నేతల మద్దతు కోసం ఆయన పాకులాడలేదని తేల్చిచెప్పారు.

Exit mobile version