NTV Telugu Site icon

Rishi Sunak: బ్రిటన్‌ ప్రధాని పదవికి అభ్యర్థిత్వం ప్రకటించిన రిషి సునాక్

Rishi Sunak

Rishi Sunak

Rishi Sunak: బ్రిటన్‌ ప్రధాని పదవి రేసులో భారత సంతతికి చెందిన కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు రిషి సునాక్‌ పేరు బలంగా వినిపిస్తోంది. రిషికి 100 మందికి పైగా పార్టీ అభ్యర్థుల మద్ధతు లభించినట్లు ఆయన అనుచరులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ప్రధాని పదవికి తాను పోటీ పడుతున్నట్లు బ్రిటన్‌ మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌ ట్విటర్‌ వేదికగా అధికారికంగా ప్రకటించారు. ప్రధాని పదవితో పాటు కన్జర్వేటివ్‌ పార్టీ నాయకత్వానికి కూడా పోటీపడుతున్నట్లు వెల్లడించారు. గొప్ప దేశమైన యూకే ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్లు రిషి సునాక్‌ తెలిపారు. గతంలో ఎన్నడూ ఎదుర్కోనంతగా దేశం సమస్యలను ఎదుర్కొంటోందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ సమస్యలను పరిష్కరించడం కోసం తాను ప్రధాని బరిలో నిలుస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత సమస్యల పరిష్కారానికి తన వద్ద స్పష్టమైన ప్రణాళిక ఉందని ఆయన చెప్పారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన రికార్డు కూడా తనకు ఉందన్నారు. సరైన వారిని ఎంపిక చేసుకుంటేనే అవకాశాలు కూడా అద్భుతంగా ఉంటాయన్నారు.

Ola S1 Air: ఓలా మరో సంచలనం.. బడ్జెట్ ధరలోనే కొత్త మోడల్

గత కొన్ని నెలల క్రితం బోరిస్ జాన్సన్ రాజీనామా చేసిన తర్వాత ‘లిజ్ ట్రస్’ ప్రధాని పీఠమెక్కడం, కేవలం 45 రోజులకే అనుకోని పరిస్థితుల వల్ల పదవికి రాజినామా చేయడం వరుసగా జారిపోయాయి. అయితే ఆ ఎన్నికల్లో లిజ్ ట్రస్‌తో పోటీ పడి చివరి వరకు రేసులో నిలిచిన రిషి సునాక్.. ఇప్పుడు మరోసారి ప్రధాని పదవి అందుకోవడానికి రేసులో ముందు వరుసలో నిలిచారు. ప్రధాని పదవి రేసులో నిలిచేందుకు అవసరమైన 100 మంది టోరీ పార్టీ ఎంపీల మద్దతు తమ నేతకు లభించిందని సునాక్‌ అనుచరులు శనివారం వెల్లడించారు. పార్టీ నిబంధనల ప్రకారం పార్టీ నేతగా పోటీ పడే అభ్యర్థికి కనీసం 100 మంది ఎంపీల మద్దతు తప్పనిసరిగా ఉండాలి. ప్రస్తుతం పార్లమెంటులో కన్జర్వేటివ్‌ పార్టీకి 357 మంది ఎంపీలున్నారు. పెన్నీ మోర్డాంట్‌.. తాను ప్రధాని రేసులో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆమెకు 20 మంది ఎంపీల మద్దతు మాత్రమే ఇప్పటివరకు లభించినట్లు సమాచారం. మూడో అభ్యర్థిగా మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ రంగంలోకి దిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా పోటీ రిషి సునాక్‌, బోరిస్‌ జాన్సన్‌ల మధ్య ఉండనున్నట్లు తెలుస్తోంది.