Rishabh Pant: టీమిండియాలోకి ఓ స్టార్ ప్లేయర్ రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా.. ఈ స్టోరీలో తెలుసుకుందాం.. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత టీమిండియా.. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. నవంబర్ 14 నుంచి ఇరు జట్లు మధ్య రెండు టెస్ట్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ సిరీస్ కోసం భారత జట్టును త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఇదే టైంలో టీమిండియా స్టార్ ప్లేయర్ గురించి ఒక కీలక అప్‌డేట్ వచ్చింది. గాయం నుంచి కోలుకున్న తర్వాత అతను భారత టెస్ట్ జట్టులోకి తిరిగి రాబోతున్నాడని సమాచారం. దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌కు ఈ ప్లేయర్ ఎంపిక కావడం ఖాయం అని క్రీడా వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది.
READ ALSO: Lucky Draw: రియల్ ఎస్టేట్ లో లక్కీ డ్రా ట్రెండ్.. జస్ట్ రూ.1000 తో లక్షల విలువైన ఇల్లు సొంతం!
జట్టులోకి రానున్న స్టార్ ప్లేయర్..
పలు నివేదిక ప్రకారం.. ఈ సిరీస్ కోసం టీమిండియా జట్టును ఎంపిక చేశారు. కానీ జట్టు ప్రకటన ఇంకా పెండింగ్‌లో ఉంది. ఈ సిరీస్ కోసం భారత టెస్ట్ జట్టులోకి గాయం నుంచి కోలుకున్న వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ తిరిగి రానున్నట్లు సమాచారం. పంత్‌కు జూలైలో మాంచెస్టర్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన నాల్గవ టెస్ట్ సందర్భంగా కాలి గాయం అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పంత్ గాయం నుంచి కోలుకోవడంతో ఇటీవల ఇండియా A తరపున ఆడుతూ మైదానంలోకి తిరిగి వచ్చాడు. ఇప్పుడు పంత్ టీమిండియాలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
పంత్ గాయపడిన తర్వాత ఇంగ్లాండ్ పర్యటనకు ఎన్.జగదీశన్ జట్టులోకి తీసుకున్నారు. అయితే రానున్న దక్షిణాఫ్రికా సిరీస్ నుంచి అతనిని తప్పించడం ఖాయమని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. గత వారం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో దక్షిణాఫ్రికా ఎతో జరిగిన మొదటి నాలుగు రోజుల మ్యాచ్‌లో ఇండియా ఎ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం ద్వారా పంత్ తన మ్యాచ్ ఫిట్‌నెస్‌ను ప్రదర్శించాడు. ఎన్. జగదీసన్ చాలా కాలంగా దేశీయ క్రికెట్‌లో అద్భుతంగా పరుగులు సాధిస్తున్నాడు. ఇదే మనోడికి టీమిండియాలో స్థానం సంపాదించిపెట్టింది. కానీ జగదీసన్ ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయలేదు. దక్షిణాఫ్రికాలో జగదీసన్‌కు అవకాశాలు లేకపోవడంతో అతను తన అరంగేట్రం కోసం ఎక్కువ కాలం వేచి ఉండాల్సి వస్తుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అతను రంజీ ట్రోఫీలో ఆడుతున్నాడు.
READ ALSO: SS Rajamouli : ప్రభాస్ ను అలాంటి బట్టల్లో చూసి షాక్ అయ్యా.. రాజమౌళి కామెంట్స్
