Rishabh Pant Injury and Viral Entry Style: ఐపీఎల్ 2026లో భాగంగా నేడు (ఏప్రిల్ 15) బెంగళూరులోని చినస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (LSG) మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకోగా, LSG తొలుత బ్యాటింగ్‌కు దిగింది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (LSG) నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది.
RCB Vs LSG: నిప్పులు చెరిగిన ఆర్సీబీ బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన LSG..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పవర్‌ప్లేలోనే ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి LSGను ఒత్తిడిలోకి నెట్టారు. ప్రారంభంలోనే తక్కువ స్కోరుకు పరిమితం చేస్తూ మ్యాచ్‌పై పట్టు సాధించారు. అయితే ఈ మ్యాచ్‌లో ప్రధాన చర్చాంశం రిషభ్ పంత్ గాయం. ఇన్నింగ్స్ 5వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్, జోష్ హాజల్ వుడ్ బౌలింగ్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. మొదటి బంతిని మిస్ జడ్జ్ చేయగా, రెండో బంతి అతని పొట్టకు తగిలింది. మూడో బంతి ఎల్బోకు బలంగా తగలడంతో తీవ్ర నొప్పితో బాధపడ్డాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించగా.. చివరికి జట్టు అతన్ని ‘రిటైర్డ్ హర్ట్’గా పెవిలియన్‌కు పంపించింది. దీనితో పంత్ ఖాతా తెరవకుండానే మైదానం వీడాడు.
ఇదిలా ఉంటే, మరోవైపు పంత్ మైదానంలోకి వచ్చిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. డ్రెస్సింగ్ రూమ్ నుంచి నేరుగా అడ్వర్టైజింగ్ బోర్డ్ పై నుంచి దూకుతూ గ్రౌండ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ స్టైల్‌ను మిల్లర్ 2015 వరల్డ్ కప్ సమయంలో ప్రదర్శించగా, ఇప్పుడు పంత్ అదే తరహాలో చేయడంతో అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు.
Vaibhav Sooryavanshi అంతర్జాతీయ అరంగేట్రం.. ఆ స్టార్ ఆటగాళ్ల టీ20 స్థానం ప్రమాదంలో..?
పంత్ గాయం తీవ్రతపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే జట్టుకు కీలకమైన ఈ ఆటగాడిని సీజన్ ఆరంభంలోనే కోల్పోవడం LSGకు పెద్ద నష్టంగా మారే అవకాశం ఉంది. పంత్ ను స్కాన్ లకు పంపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ ప్రారంభ దశలోనే ఈ గాయం LSGకు ఆందోళన కలిగిస్తోంది
— Red (@thecamgreen042) April 15, 2026
Rishabh Pant gets a blow on his Elbow
What a bowling this by RCB ❤️, Hazlewood ☠️ test match lines and result for him ! Krunal gets 2 wickets! #RCBvsLSG #IPL2026 pic.twitter.com/BvRTGLn4lo
— Cricket IQ (@S17Anurag) April 15, 2026
