NTV Telugu Site icon

Rishabh Pant: రూ. 27 కోట్లు గంగలో కలిసినట్లేనా..? రిషబ్ పంత్ ప్లాప్ షో!

Panth

Panth

Rishabh Pant: వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మొదటగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 209 పరుగుల భారీ స్కోరు చేసింది. LSG బ్యాటింగ్‌ ఇన్నింగ్స్ లో నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్ ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఇది ఇలా ఉంటే కెప్టెన్ రిషబ్ పంత్ అట్టర్ ప్లాప్ అయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఈ పోరులో పంత్ ఒక్క పరుగు కూడా చేయకుండా పెవిలియన్‌కు చేరుకోవడంతో అభిమానులు నిరాశలో మునిగిపోయారు.

Read Also: ATM Withdraw: ఏటీఎం వాడేవారికి షాక్.. క్యాష్ విత్‌డ్రాయల్ ఛార్జీలు మరింత పెంపు!

రిషబ్ పంత్ ఈ మ్యాచ్‌లో 6 బంతులు ఆడి, ఒక్క పరుగు కూడా చేయకుండానే ఔటయ్యాడు. 13.4 ఓవర్‌లో కుల్‌దీప్ బౌలింగ్‌లో ఫాఫ్ డుప్లెసిస్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. భారీ ధరకు అతడిని కొనుగోలు చేసిన లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీకి ఇది పెద్ద షాక్‌గా మారింది. ఈ సీజన్‌ ఐపీఎల్ మెగా వేలంలో రిషబ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా రూ. 27 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా జట్టు కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించింది. భారీ ఆశలొతో ఉన్న అభిమానులకు తన తొలి మ్యాచ్‌లోనే తేలిపోవడంతో అభిమానుల నిరాశ చెందారు.

Read Also: LSG vs DC: పూరన్, మార్ష్ ఊచకోత.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే..?

ఇక మ్యాచ్ లో డక్ అవుట్ కావడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ కొనసాగుతోంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్మబడిపోయిన వ్యక్తి ఇలా మొదటి మ్యాచ్ లోనే నిరాశ పరచడం చాలా బాధాకరమైన విషయమని కొందరు కామెంట్ చేస్తుండగా.. మరికొందరేమో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఓనర్ కు ఇది జరగాల్సిందే అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మరి తొలి మ్యాచ్‌లో నిరాశపరిచిన రిషబ్ పంత్ తన బ్యాటింగ్‌తో రానున్న మ్యాచ్‌ల్లో రాణిస్తాడా? లేకపోతే మరోసారి విమర్శలు ఎదుర్కొంటాడా? అనేది వేచి చూడాల్సిన విషయం.