NTV Telugu Site icon

Rishabh Pant: 140 స్పీడ్ బాల్స్ను ఎదుర్కొంటున్న రిషబ్.. వరల్డ్ కప్లో ఆడేనా..!

Rishab

Rishab

భారత వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ డిసెంబర్ 2022లో రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. రిషబ్ పూర్తిగా కోలుకోవడానికి కనీసం 18 నెలల సమయం పడుతుందని మొదట్లో చెప్పినప్పటికీ.. ఫిట్ నెస్ పై శ్రద్ధ చూపుతున్నాడు. మరోవైపు ఘటన జరిగిన ఎనిమిది నెలల తర్వాత నుంచే నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేయడం మొదలుపెట్టాడు. NCAలో 140kph-ప్లస్ డెలివరీలను ఎదుర్కొంటున్నాడు.

Anju Nasrullah Love Story: అంజు కేసులో కొత్త ట్విస్ట్.. అంజు, నస్రుల్లాపై అరవింద్ పోలీసులకు ఫిర్యాదు

తొంద‌ర‌గా కోలుకునేందుకు పంత్ ప్రతి క‌ష్టాన్ని దాటుతున్నాడని NCA తెలిపింది. నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న అత‌డిని చూస్తుంటే సంతోషంగా ఉందని.. ఎన్‌సీఏకి వ‌చ్చాక‌ పంత్ ఆరోగ్యం చాలా మెరుగుప‌డిందన్నారు. ఈ లెఫ్ట్ హ్యాండ‌ర్ శ‌రీరాన్ని వేగంగా క‌దిలించ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నాడు’ అని ఎన్‌సీఏ ఓ ప్రక‌ట‌న‌లో తెలిపింది.

Sagileti katha: చికెన్ చుట్టూ ‘సగిలేటి కథ’..ట్రైలర్ కి అనూహ్య స్పంద

మరోవైపు KL రాహుల్, శ్రేయాస్ అయ్యర్ కూడా NCAలో ఉన్నారు. ఆసియా కప్ 2023కి ముందు ఫిట్‌గా ఉండాలనే లక్ష్యంగా శ్రమిస్తున్నారు. ఈ ఇద్దరు కూడా నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించారు. ఐతే వీరు ఆసియా క‌ప్, వ‌ర‌ల్డ్ క‌ప్‌లోపు ఫిట్‌నెస్ సాధిస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు వరల్డ్ కప్ కు ముందు కేఎల్ రాహుల్ కోలుకోవచ్చని.. అయ్యర్ కొంచెం సమయం పట్టవచ్చని చెబుతున్నారు. ఒకవేళ వీరిద్దరిలో ఎవరొకరు రాకపోయినా.. సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్‌లకు జట్టులో స్థానం దక్కే అవకాశాలు ఉన్నాయి.