భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ కొత్త అవతారమెత్తాడు. రిషబ్ పంత్ కెరీర్‌లో ఇప్పటివరకు చూడనిది ఈ మ్యాచ్‌లో కనిపించింది. రిషబ్ పంత్ కొన్ని క్షణాలు వేరే అవతారంలో కనిపించాడు. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్ టీ20ని ప్రారంభించింది. ఈ టీ20 టోర్నమెంట్‌లో రిషబ్ పంత్ ఆడుతున్నాడు. రిషబ్ పంత్ ఓల్డ్ ఢిల్లీ 6కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
Delhi: విషాదం.. పై అంతస్తు నుంచి ఏసీ పడి యువకుడు మృతి
వాస్తవానికి.. DPL T20 టోర్నమెంట్‌లో ఆడుతున్న రిషబ్ పంత్.. వికెట్ కీపర్‌గా కాకుండా బౌలర్ గా కనిపించాడు. కీపర్ స్థానంలో వంశ్ బేడీ అనే ప్లేయర్ బాధ్యతను తీసుకున్నాడు. ఈ క్రమంలో పంత్ ఫీల్డర్‌గా కనిపించాడు. అంతే కాకుండా.. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చివరి ఓవర్ బౌలింగ్ చేయడానికి రిషబ్ పంత్ స్వయంగా వచ్చాడు. ఇప్పటి వరకూ రిషబ్ పంత్ తన కెరీర్ లో బౌలింగ్ చేయలేదు. కానీ తొలిసారిగా అతను బౌలింగ్ చేయడం కనిపించింది.
Sivaji-Laya: మరోసారి జంటగా శివాజీ-లయ.. 14 ఏళ్ల తర్వాత..
అయితే ఈ మ్యాచ్‌లో ఓల్డ్ ఢిల్లీ 6 జట్టు దాదాపు ఓడిపోయిన పరిస్థితి. ఈ క్రమంలో రిషబ్ పంత్ బౌలింగ్‌కు దిగాడు. దక్షిణ ఢిల్లీ సూపర్‌స్టార్స్‌కు చివరి ఓవర్‌లో కేవలం ఒక పరుగు మాత్రమే అవసరం. దీంతో.. బౌలింగ్ వేసిన రిషబ్ పంత్ తొలి బంతిని ఫుల్ టాస్ వేశాడు. ఆ బంతికి ఒక్క పరుగు చేసి సౌత్ ఢిల్లీ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో.. రిషబ్ పంత్ బ్యాటింగ్ చూడటానికి ప్రేక్షకులు తరలి వచ్చారు. అయితే.. పంత్ బ్యాటింగ్ కోసం వచ్చిన అభిమానులకు బౌలింగ్ తో మెస్మరైజ్ చేశాడు. కాగా.. పంత్ 32 బంతుల్లో 35 పరుగులు చేశాడు.
https://twitter.com/indianspirit070/status/1824882267698979290
