Site icon NTV Telugu

Rishab Shetty : పాన్ ఇండియా మార్కెట్‌లో జోరు చూపిస్తున్న రిషబ్‌ శెట్టి

Rishab Shetty

Rishab Shetty

Rishab Shetty : బాహుబలితో డార్లింగ్ ప్రభాస్ ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ హీరోగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కేజీఎఫ్‌తో యష్, ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో రామ్ చరణ్‌, ఎన్టీఆర్‌లు పాన్ ఇండియా స్టార్లుగా భారీ బడ్జెట్ సినిమాలను తీస్తున్నారు. ఆ తర్వాత మరికొందరు సైతం పాన్‌ ఇండియా స్థాయిలో మంచి విజయాలను సొంతం చేసుకోవడంతో పాన్‌ ఇండియా స్టార్లుగా అవతరించారు. కాంతార సినిమాతో రిషబ్‌ శెట్టికి పాన్ ఇండియా లెవల్లో మంచి గుర్తింపు దక్కింది. ఈయన సైతం స్టార్ డమ్ ను సొంతం చేసుకున్నాడు. దానిని కాపాడుకోవడం కోసం అదే స్థాయి సినిమాలను చేసేందుకు ఆయన ఆసక్తిని కనబరుస్తున్నాడు. అలాంటి ఆఫర్లనే ఓకే చేస్తున్నాడు.

Read Also:Indian Navy Day : ఇండియన్ నేవీ డే ఎందుకు జరుపుకుంటారు? ప్రాముఖ్యత ఏమిటి..?

ఇప్పటికే కాంతార చాప్టర్ 1 సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేయడానికి భారీ బడ్జెట్ పెడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో జై హనుమాన్‌ సినిమాకు ఆయన కమిట్ అయ్యాడు. హనుమాన్‌ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో జై హనుమాన్‌ సినిమాకు పాన్‌ ఇండియా రేంజ్‌లో అంచనాలు భారీగా పెరిగాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ప్రశాంత్‌ వర్మ సినిమాను రూపొందించే అవకాశాలు ఉన్నాయి. సినిమాలో రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో కనిపించబోతున్నాడని ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది.

Read Also:Rahul Gandhi: ఉద్రిక్తంగా మారన రాహుల్ గాంధీ సంభాల్ పర్యటన..

కాంతార చాప్టర్‌ 1, జై హనుమాన్‌ సినిమాలతో పాటు రీసెంటుగా చత్రపతి శివాజీ మహారాజ్ సినిమాకు రిషబ్‌ శెట్టి ఓకే చెప్పారు. సందీప్‌ సింగ్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో పది భాషలకు పైగా విడుదల అయ్యే విధంగా శివాజీ మహారాజ్ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో రిషబ్‌ శెట్టిని చత్రపతి మహారాజ్‌గా చూపించబోతున్నారు. తాజాగా విడుదల అయిన పోస్టర్‌లో శివాజీ లుక్‌లో రిషబ్‌ షాక్ అయ్యారు. నిజంగా శివాజీ మహారాజ్‌ను చూసినట్లుగా ఉందంటూ మరాఠా ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ హీరోలు అంటే ఇప్పటి వరకు ప్రభాస్‌, యష్ మరికొందరి పేర్లు మాత్రమే వినిపించేవి. ఇప్పుడు ఆ జాబితాలో మరోస్టార్‌గా రిషబ్‌ శెట్టి పేరు ప్రముఖంగా వినిపించబోతుంది.

Exit mobile version