Site icon NTV Telugu

Rishab Shetty New Movie: రిషబ్ శెట్టి కొత్త సినిమాలో విలన్‌గా బాలీవుడ్ స్టార్ !

Rishab Shetty

Rishab Shetty

Rishab Shetty New Movie: కాంతారా చాప్టర్ 1 సినిమా తర్వాత రిషబ్ శెట్టి కొత్త చిత్రం “ది ప్రైడ్ ఆఫ్ ఇండియా: ఛత్రపతి శివాజీ మహారాజ్” కోసం రంగంలోకి దిగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమాలో కొత్త స్టార్ ఎంట్రీ గురించి జోరుగా ప్రచారం జరుగుతుంది. పలు నివేదికల ప్రకారం.. బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్, రిషబ్ శెట్టి చిత్రంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పాత్రను పోషించనున్నట్లు సమాచారం.

READ ALSO: Amazon layoffs: అమెజాన్ ఉద్యోగులకు నిద్రలేని రాత్రులు.. అందరిలో “లేఆఫ్” భయం..

‘ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్’ సినిమాకు సందీప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ సింగ్ ఈ చారిత్రక చిత్రం కోసం ఔరంగజేబ్ పాత్రకు వివేక్ ఒబెరాయ్‌ను ఖరారు చేసినట్లు పలు వర్గాలు తెలిపాయి. ఈ వార్తతో వివేక్ ఒబెరాయ్ అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. అయితే చిత్ర నిర్మాతలు ఇంకా ఈ వార్తలను అధికారికంగా ధృవీకరించలేదు. త్వరలోనే ఈ చిత్రంలోని నటీనటులను మేకర్స్ వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. వివేక్ ఒబెరాయ్ ప్రస్తుతం అతను సందీప్ రెడ్డి వంగా స్పిరిట్, మస్తీ 4, రామాయణ్ లలో కూడా నటించబోతున్నట్లు టాక్ నడుస్తుంది. కాంతారా చాప్టర్ 1 తో సంచలనం సృష్టించిన రిషబ్ శెట్టి ఛత్రపతి శివాజీ మహారాజ్‌గా నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ సినిమాలో రిషబ్ శెట్టి, వివేక్ ఒబెరాయ్‌లతో పాటు, షెఫాలి షా కూడా భాగం కానున్నట్లు టాక్. ఈ చిత్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ తల్లి పాత్రలో షెఫాలి షా నటిస్తున్నట్లు సమాచారం.

READ ALSO: Ashwin Questions Gambhir: టీమిండియా ఓటమి తర్వాత గంభీర్‌కు అశ్విన్ సూటి ప్రశ్న!

Exit mobile version