NTV Telugu Site icon

Kantara Update: బాక్సాఫీసును కొల్లగొడుతున్న కాంతార.. 300 కోట్లకి పైగా వసూళ్లు

Kantara

Kantara

Kantara Update: చిన్న సినిమాగా మొదలై ఇండస్త్రీని ఓ ఊపు ఊపేస్తోన్న సినిమా కాంతార. కన్నడలో రూపొందినా కూడా కంటెంట్ కొత్తగా ఉంటే ఎలాంటి ప్రేక్షకులైనా ఆదరిస్తారనే విషయాన్ని మరోసారి రుజువు చేసింది. కన్నడలో రూపొందిన ఈ కాంతార అక్కడ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. ఆ సినిమాకు వస్తున్న క్రేజ్ చూసి వారం రోజుల్లో మరో మూడు భాషల్లో డబ్ చేసి విడుదల చేశారు. దీంతో విడుదలైన అన్ని భాషల్లోనూ వసూళ్ల వర్షం కురిపించింది. ఇంతవరకూ ఈ సినిమా 300 కోట్లకి పైగా వసూళ్లను సాధించినట్టుగా, తాజాగా ఈ సినిమా టీమ్ అధికారిక పోస్టర్ విడుదల చేసింది.

Read Also: Prabhas: మిల్కీబ్యూటీని ఆట ఆడిస్తున్న ప్రభాస్.. వైరలవుతున్న వీడియో

తెలుగులో డబ్ చేసిన ‘కాంతార’ పెను సంచలనాలను సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే ఈ చిత్రం కేవలం 18 రోజుల్లోనే భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 2కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 2.30 కోట్లుగా నమోదైంది. ఇక, 18 రోజుల్లో ఈ చిత్రానికి భారీ స్థాయిలో రూ. 22.68 కోట్లకుపైగా వచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 20.38 కోట్లకుపైగా లాభాలు వచ్చినట్లు సమాచారం.

Read Also: Tirumala : తిరుమలలో కారు కలకలం.. పోలీసులు ఛేజింగ్.. కారు వదిలి లోయలో దూకిన యువకులు

రిషబ్ శెట్టి – సప్తమి గౌడ జంటగా నటించిన ‘కాంతార’ కన్నడలో సెప్టెంబర్ 30వ తేదీన విడుదలైంది. తొలి రోజునే అక్కడ ఆ సినిమా రికార్డుస్థాయి వసూళ్లను చూడటంతో, 15 రోజుల తరువాత తెలుగుతో పాటు ఇతర భాషల్లోను విడుదల చేశారు. ‘కేజీఎఫ్’ సినిమాను నిర్మించిన బ్యానర్ కావడంతో, ఇతర భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి బడా సంస్థలు పోటీ పడ్డాయి. ఏ భాషలో విడుదల చేస్తే ఆ భాషలో ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది.