Paris Olympics 2024: 2024 పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తోంది. చాప కింద నీరులా క్రీడాకారులకు, ఇతరులకు ఈ వ్యాధి వ్యాపిస్తోంది. ఇప్పటికే 40కి పైగా కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కొత్తగా నమోదవుతున్న కేసుల నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది. కోవిడ్ కేసులు మళ్లీ నమోదవుతున్నాయని, అన్ని దేశాలు తమ ప్రతిస్పందన చర్యలకు పదును పెట్టాల్సిన అవసరం ఉందని WHO నొక్కి చెప్పింది.
Read Also: Pawan Kalyan: వైసీపీకి షాక్.. జనసేన గూటికి వైసీపీ కార్పొరేటర్లు.. పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
పారిస్ గేమ్స్‌లో ఇప్పటికే ప్రముఖ క్రీడాకారులు కోవిడ్ బారిన పడ్డారు. బ్రిటీష్ స్మిమ్మర్ ఆడమ్ పీటి 100 మీటర్ల విభాగంలో రజతం సాధించిన తర్వాతి రోజు అనారోగ్యం బారిన పడ్డాడు. పరీక్షలు నిర్వమించగా కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఆస్ట్రేలియా ప్లేయర్ లానీ పల్లీస్టర్ అనారోగ్యంతో గేమ్స్ నుంచి నిష్ర్కమించింది. అయితే, ఒలింపిక్స్ సహా ఇటీవలి కాలంలో సీజన్‌తో సంబంధం లేకుండా చాలా దేశాలు కోవిడ్ -19 యొక్క ఉప్పెనలను ఎదుర్కొన్నాయి.