NTV Telugu Site icon

Rinku Singh Six: రింకూ సింగ్‌ పవర్‌ఫుల్ షాట్.. బాక్సులు బద్దలు! వీడియో వైరల్

Rinku Singh Six

Rinku Singh Six

Rinku Singh Six Brokes window glass in IND vs SA 1nd T20: ఐపీఎల్ స్టార్, టీమిండియా యువ ఆటగాడు రింకూ సింగ్ భారీ షాట్లతో అలరిస్తున్నాడు. ఇటీవల సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన టీ20ల సిరీస్‌లో చెలరేగిన రింకూ.. ప్రస్తుతం దక్షిణాఫ్రికా గడ్డపైనూ దుమ్మురేపుతున్నాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో బౌలర్లను ఓ ఆటాడుకుంటున్నాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన రెండో టీ20లో రింకూ 40 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. రింకూ కొట్టిన ఓ భారీ సిక్సర్‌కు సంబందించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది.

దక్షిణాఫ్రికా బ్యాటర్ ఎయిడెన్ మార్క్‌రమ్ వేసిన 19వ ఓవర్‌ చివరి బంతిని రింకూ సింగ్ భారీ సిక్సర్‌గా మలిచాడు. ముందుకొచ్చి స్ట్రైట్‌గా షాట్ ఆడగా.. బంతి సైట్ స్క్రీన్‌పై ఉన్న మీడియా బాక్స్ గ్లాస్‌ను తాకింది. బంతి బలంగా తాకడంతో గ్లాస్ పగిలిపోయింది. ఈ సిక్సర్‌కు సంబంధించిన వీడియోను స్టార్ స్పోర్ట్స్ ఎక్స్‌లో పోస్ట్ చేయగా.. ఇప్పుడు వైరల్ అవుతోంది. వాట్ ఏ ప్లేయర్, వాట్ ఏ షాట్ అంటూ రింకూ పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రింకూ అంతకుముందు బంతిని కూడా భారీ సిక్సర్‌గా మలిచాడు.

Also Read: Suryakumar Yadav: టీ20ల్లో చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్!

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ వర్షంతో మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 19.3 ఓవర్లలో 7 వికెట్లకు 180 పరుగులు చేసింది. రింకూ సింగ్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్ (56; 36 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేశాడు. డక్‌వర్త్‌ లూయిస్‌ విధానంలో సవరించిన లక్ష్యాన్ని (15 ఓవర్లలో 152) దక్షిణాఫ్రికా 13.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హెండ్రిక్స్‌ (49; 27 బంతుల్లో 8×4, 1×6), మార్‌క్రమ్‌ (30; 17 బంతుల్లో 4×4, 1×6) చెలరేగారు.

Show comments