Rinku Singh: క్షమాపణలు చెప్పిన రింకూ సింగ్.. వీడియో వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rinku Singh said sorry after the IND vs SA 2nd T20I: యువ బ్యాటర్ రింకూ సింగ్ భారత్ తరఫున టీ20లలో అదరగొడుతున్నాడు. ప్రతి మ్యాచ్‌లో బౌండరీలు బాదుతూ పరుగుల వరద పారిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో స్వదేశంలో టీ20 సిరీస్‌లో సత్తాచాటిన రింకూ.. తాజాగా దక్షిణాఫ్రికా గడ్డ మీద కూడా మెరుస్తున్నాడు. మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో రింకూ మెరుపు ఇనింగ్స్ ఆడాడు. 39 బంతుల్లోనే 68 పరుగులతో అజేయంగా నిలిచాడు. రింకూ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.
అయితే ఈ మ్యాచ్‌లో రింకూ సింగ్ బాదిన ఓ సిక్సర్ కారణంగా మీడియా గ్లాస్ బాక్స్ బద్దలైంది. ఇడెన్ మార్క్రమ్ వేసిన 19వ ఓవర్ చివరి బంతిని రింకూ స్ట్రైట్‌గా ఆడగా.. సైట్ స్క్రీన్‌పై ఉన్న మీడియా బాక్స్ గ్లాస్‌ను బలంగా తాకింది. దాంతో అది ముక్కలైంది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఈ విషయం గురించి మ్యాచ్ అనంతరం స్పందించిన రింకూ.. స్టేడియం నిర్వాహకులకు క్షమాపణలు చెప్పాడు. బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో రింకూ మాట్లాడాడు.
Also Read
- Sri Hari Stotram: తొలి ఏకాదశి వేళ భక్తి టీవీలో అమృతతుల్యమైన "శ్రీహరి స్తోత్రం".. తప్పక వినండి!
- Tirumala: తొలి ఏకాదశి రద్దీతో కిటకిటలాడుతున్న తిరుమల.. సర్వదర్శనానికి 20 గంటల నిరీక్షణ..!
- Jagtial: జగిత్యాలలో విషజ్వరాల కలకలం.. రెండు రోజుల్లో ఇద్దరు చిన్నారులు మృతి
- Jhandu Kumar: పోలియోను జయించి, పేదరికాన్ని తొక్కేసి.. భారత్‌కు తొలి పతకం అందించిన బీహార్ కుర్రాడి కన్నీటి గథ!
Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీ వెజిటేరియన్ కదా.. ‘చికెన్ టిక్కా’ తినడం ఏంటి?
‘ఆ బంతిని సిక్సర్‌గా మలచాలని మాత్రమే భావించా. నా షాట్ కారణంగా మీడియా గ్లాస్ బాక్స్ పగిలిపోయిందని నాకు తెలియదు. ఆ విషయం గురించి నా సహచరులు చెప్పారు. గ్లాస్ బ్రేక్ చేసినందుకు స్టేడియం నిర్వాహకులకు క్షమాపణలు చెబుతున్నా’ అని రింకూ సింగ్ పేర్కొన్నాడు. ‘పవర్ ప్లేలో మూడు వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చా. ఆ సమయంలో సూర్యకుమార్ యాదవ్ గైడ్ చేశాడు. వికెట్ల గురించి ఆలోచించకుండా.. నీ ఆట ఆడమని చెప్పాడు. క్రీజులో కుదురుకోవడానికి కొంత సమయం తీసుకున్నా. తర్వాత షాట్స్ ఆడాను’ అని రింకూ చెప్పాడు.
Maiden international FIFTY 👌
Chat with captain @surya_14kumar 💬
… and that glass-breaking SIX 😉@rinkusingh235 sums up his thoughts post the 2⃣nd #SAvIND T20I 🎥🔽 #TeamIndia pic.twitter.com/Ee8GY7eObW— BCCI (@BCCI) December 13, 2023
Rinku Singh’s six broke media box glass. 🔥
– Rinku is insane…!!!!pic.twitter.com/hJazne80PU
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 12, 2023
తాజావార్తలు
-
Sri Hari Stotram: తొలి ఏకాదశి వేళ భక్తి టీవీలో అమృతతుల్యమైన “శ్రీహరి స్తోత్రం”.. తప్పక వినండి!
-
దక్షిణాదిలో ఆంక్షలు.. హిందీలో స్వేచ్ఛ.. తమన్నా షాకింగ్ కామెంట్స్!
-
Monsoon Havoc: హిమాచల్‌లో వర్ష బీభత్సం.. ఆకస్మిక వరదలు, విరిగిపడిన కొండచరియలు.. 80 మంది మృతి
-
Tirumala: తొలి ఏకాదశి రద్దీతో కిటకిటలాడుతున్న తిరుమల.. సర్వదర్శనానికి 20 గంటల నిరీక్షణ..!
-
Jeep Meridian: భారత్‌లో జీప్ మెరిడియన్ 85వ యానివర్సరీ ఎడిషన్ విడుదల.. కొత్త ఫీచర్లు, AI అసిస్టెంట్.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!