Duleep Trophy 2024: అందుకే నన్ను దులీప్ ట్రోఫీకి ఎంపిక చేయలేదు: రింకు సింగ్
- సెప్టెంబర్ 5 నుంచి దులీప్ ట్రోఫీ
- రింకు సింగ్‌ను పక్కనపెట్టిన బీసీసీఐ
- కారణం ఏంటో చెప్పిన రింకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rinku Singh about Duleep Trophy omission: సెప్టెంబర్ 5 నుంచి దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ 2024 ఆరంభం కానుంది. ఈ టోర్నీలో బరిలోకి దిగే నాలుగు జట్లకు శుభ్‌మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్‌లు కెప్లెన్లుగా ఎంపికయ్యారు. దాదాపుగా అందరు భారత క్రికెటర్స్ దులీప్ ట్రోఫీలో ఆడుతున్నారు. సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయిన వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కూడా ఆడనున్నాడు. సీనియర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, ఆర్ అశ్విన్‌లు మొదటి రౌండ్‌లో ఆడనున్నట్లు తెలుస్తోంది.
దులీప్ ట్రోఫీ 2024కి యువ బ్యాటర్ రింకు సింగ్‌ను బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. రింకును ఎందుకు తీసుకోలేదని సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. తాజాగా ఈ విషయంపై రింకు స్పందించాడు. గత సీజన్‌లో గొప్ప ప్రదర్శన చేయకపోవడంతో.. తనకు ఈ సీజన్‌లో ఆడే అవకాశం రాలేదన్నాడు. స్పోర్ట్స్ టుడేకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రింకు మాట్లాడుతూ… ‘నేను గత దేశవాళీ సీజన్‌లో బాగా ఆడలేదు. రంజీ ట్రోఫీలో కూడా ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదు. కేవలం 2-3 మ్యాచ్‌లు మాత్రమే ఆడా. నేను పెద్దగా రాణించకపోవడంతో ఇప్పుడు ఎంపిక చేయలేదు. అయితే తప్పకుండా దులీప్ ట్రోఫీ రెండో రౌండ్‌కు ఎంపిక చేస్తారనే నమ్మకంతో ఉన్నా’ అని చెప్పాడు.
Also Read
- CM CBN Reviews on Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
- Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు..!
- Import Duty Cuts on Edible Oils: పండుగలకు ముందే ఊరట.. వంట నూనెలపై గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం..
- 144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
Also Read: Kolkata Doctor Rape-Murder: సీఎం మమతా బెనర్జీకి బెదిరింపులు.. విద్యార్థి అరెస్టు!
2023లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున రింకు సింగ్ అద్భుత ప్రదర్శన చేశాడు. 14 మ్యాచ్‌ల్లో 474 పరుగులు చేశాడు. ఆ ప్రదర్శనతో 2023 ఆగస్టులో ఐర్లాండ్‌పై అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. కొద్దికాలంలోనే టీమిండియా టీ20 మిడిల్ ఆర్డర్‌లో సెటిల్ అయ్యాడు. టీ20 ప్రపంచకప్ 2024లో స్థానం ఖాయం అనుకున్నా.. రిజర్వ్ స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది.
తాజావార్తలు
-
Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
CM CBN Reviews on Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
-
MIVI ONE 5G: మివి వన్ 5G భారత్‌లో లాంచ్.. Snapdragon 4 Gen 2, 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు..!
-
Harassment: మారండ్రా బాబు.. మరో దారుణం.. రోడ్డుపై మైనర్ బాలికపై వేధింపులు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!