బాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ ‘ధూమ్’ సినిమాతో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిన నటి రిమీ సేన్. ‘హంగామా’, ‘గోల్ మాల్’ వంటి సూపర్ హిట్ కామెడీ చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ బెంగాలీ భామ, తెలుగులో చిరంజీవి సరసన ‘అందరివాడు’ మూవీలో కూడా నటించింది. కానీ గత కొంతకాలంగా వెండితెరకు పూర్తిగా దూరమైంది. 2011లో వచ్చిన ‘షాగీర్ద్’ ఆమె చివరి సినిమా. అయితే, ఆమె ఇప్పుడు కేవలం సినిమాలకు దూరమవ్వడమే కాదు, ఏకంగా దేశాన్ని కూడా వదిలి దుబాయ్‌లో స్థిరపడ్డారు. అంతే కాదు రిమీ గురించి ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది.
Also Read : Mankatha: అజిత్ ‘గ్యాంబ్లర్’ రీ-రిలీజ్ బుకింగ్స్ చూస్తే మతిపోవాల్సిందే!
ప్రస్తుతం రిమీ సేన్ దుబాయ్‌లో ఒక ‘రియల్ ఎస్టేట్ ఏజెంట్’గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. గ్లామర్ ప్రపంచాన్ని వదిలి ఇలాంటి సాధారణ వృత్తి లోకి రావడం బాలీవుడ్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే తాను భారతదేశం వదిలి దుబాయ్‌కి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో వివరిస్తూ రిమీ సేన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. మన దేశంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు..
‘భారతదేశంలో ప్రభుత్వం రాత్రికి రాత్రే పాలసీలను మార్చేస్తుందని, దీనివల్ల సామాన్య ప్రజల జీవితాలు, వ్యాపారం చేయడం చాలా కష్టతరంగా మారుతుంది. నా దృష్టిలో ఇండియా ఇప్పుడు వ్యాపారం చేయడానికి అనుకూలమైన దేశం కాదు. అందుకే నా బిజినెస్ పరంగా ఎంతో సులభమైన నిబంధనలు ఉన్న దుబాయ్‌కు మారిపోయా’ అని ఆమె కుండబద్దలు కొట్టారు. సినిమాల్లో అవకాశాలు తగ్గడం వల్లే ఆమె వెళ్లారా లేక నిజంగానే వ్యాపార కారణాల వల్ల వెళ్లారా అన్నది పక్కన పెడితే, ఒక స్టార్ హీరోయిన్ ఇలా దేశం దాటి వెళ్లి రియల్ ఎస్టేట్ రంగంలో సెటిల్ అవ్వడం మాత్రం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
